విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉలిక్కిపడ్డ విశాఖ: మరో భారీ అగ్నిప్రమాదం: రాత్రంతా: ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నంలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన చోటు చేసుకున్నది ఓ పారిశ్రామికవాడలో కావడం, ఓ పరిశ్రమలో మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గత ఏడాది సంభవించిన ఎల్జీ పాలిమర్స్ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. దీనికోసం రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. మంటలు చెలరేగడానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నారు.

తాజాగా- అగనంపూడి సమీపంలోని ఏపీఐఐసీ మినీ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న ప్యారామౌంట్‌ సన్‌ లియో ఆగ్రో ఇండస్ట్రీస్‌ కంపెనీలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వంట నూనెలు తయారు చేస్తోన్న సమయంలో మంటలు చెలరేగాయి వంటనూనెల ప్యాకింగ్ ప్లాంట్‌లో తొలుత మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. అగ్నికీలలు మిగిలిన యూనిట్లకు వ్యాపించకుండా ఉద్యోగులు, సిబ్బంది ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాలేదు. మరింత విస్తరించాయి. వంటనూనెల తయారీ యూనిట్‌కు వ్యాపించాయి.

Visakhapatnam: Fire breaks out at Paramount Agro Industries in Aganampudi

Recommended Video

#KamalaHarris Impresses With Her Speech At Swearing-In Ceremony | Oneindia Telugu

స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫార్మాసిటీ, పెదగంట్యాడల నుంచి మూడు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి రప్పించారు. మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనికోసం అన్వేషిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

English summary
A major fire broke out at Paramount Agro Industries, APIIC Industrial Park at Aganampudi in Gajuwaka. The incident happened on Wednesday night. It took a while for the fire extinguishers to douse the fire even though they rushed to the spot as soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X