• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖ పెను విషాదం: ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తుల అమ్మకానికి ఓకే -కలెక్టర్ ఖాతాలో డబ్బు -తగ్గని జగన్ సర్కార్

|

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటనల్లో ఒకటిగా భావించే విశాఖపట్నం గ్యాస్ లీకేజీ విషాదానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విషవాయువు లీకైన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు ఊరటకల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అదే సమయంలో కఠిన నిబంధనలూ విధించింది. 11 మంది దుర్మరణం చెందిన సదరు ఘటనను సీఎం జగన్ సీరియస్ గా భావిస్తుండగా, ఇప్పుడు ప్రభుత్వ కమిటీ పర్యవేక్షణలోనే ఎల్జీ పాలిమర్స్‌లో ఉన్న ముడి సరుకుతోపాటు ఉత్పత్తులు విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. అయితే, ప్లాంట్ శాశ్వత మూసివేత విషయంలో జగన్ సర్కారు వెనక్కి తగ్గబోదనే సంకేతాలు కూడా వెలువడ్డాయి. వివరాల్లోకి వెళితే..

ఎల్జీ పాలిమర్స్ మూసివేతపై విచారణ

ఎల్జీ పాలిమర్స్ మూసివేతపై విచారణ


విశాఖ శివారు ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటు నుంచి గతేడాది(2020) మే7న ప్రమాదకరమైన స్టెరీన్ విషవాయువు లీకై, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వందల మంది ప్రజలు అస్వస్థతకు గురికావడం, ఏకంగా 15 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. బాధితుల కుటుంబాలకు భారీ పరిహారం అందజేసిన జగన్ సర్కారు.. ఎల్జీ ప్లాంటుపై కేసు నమోదు చేసి, గ్యాస్‌ లీకేజ్‌కు బాధ్యులైన 12మందిని అరెస్టు కూడా చేయించింది. దుర్ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరుపగా, ప్రమాదం తర్వాత ప్లాంటులో మిగిలిపోయిన ఉన్న ముడి సరుకుతోపాటు ఉత్పత్తులు విక్రయించేందుకు అనుమతించాలని ఎల్జీ పాలిమర్స్ కోర్టును ఆశ్రయించింది. వీటిపై కీలక విచారణ జరిగింది..

సీఎం జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ -సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ రాకతో వణుకు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనంసీఎం జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ -సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ రాకతో వణుకు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం

ఉత్పత్తుల విక్రయానికి అనుమతి..

ఉత్పత్తుల విక్రయానికి అనుమతి..

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో ముడి సరుకు, ఉత్పత్తుల విక్రయాలకు ఏపీ హైకోర్టు అనుమతించింది. చీఫ్ జస్టిస్‌ అరూప్ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారం(ఏప్రిల్ 6న) ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం మూసివేతలో ఆ ప్లాంటులో ఏ చిన్న వస్తువు అమ్మకమైనా ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరగాలని ధర్మాసనం షరతు విధించింది. ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించి ఆ సంస్థ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా, ఏపీ ప్రభుత్వం తరఫున చింతల సుమన్ విచారణలో పాల్గొన్నారు. గత శుక్రవారం(ఏప్రిల్ 2) నాటికే ఈ కేసులో వాదనలు ముగియగా, మంగళవారం ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడించింది.

తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలుతల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

కమిటీ పర్యవేక్షణలోనే అమ్మకం..

కమిటీ పర్యవేక్షణలోనే అమ్మకం..

గతేడాది గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన తరువాత హైకోర్టు ఆదేశాల మేరకు ఎల్జీ పాలిమర్స్ ప్లాంటును సీజ్‌ చేశారని, కంపెనీ ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో ఉందని, అయితే మూసివేత నాటికే లోపల ముడి సరుకు, ఉత్పత్తులు, ప్యాకేజ్‌ మెటీరియల్‌ ఉండిపోయాయని, ముడి సరుకు రోజుల తరబడి పరిశ్రమలో ఉంటే ప్రమాదకరం కాబట్టి వాటిని విక్రయించడానికి అనుమతివ్వాలని, మిగిలిన ఉత్పత్తుల్ని ఎవరికి, ఎంతకు, ఎలా అమ్ముతున్నామనే వివరాలను అఫిడవిట్ రూపంలో అందజేస్తామని ఎల్జీ పాలిమర్స్ తరఫు న్యాయవాది చెప్పగా, కాంపిటెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో విక్రయ ప్రక్రియ జరగాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది సునీల్ అన్నారు. చివరికి మూడు కీలక శాఖల అధికారులతో కూడిన కమిటీ పర్యవేక్షణలోనే ప్లాంటులోని ఉత్పత్తుల అమ్మకాలు జరపాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు..

ఆ డబ్బులు కలెక్టర్ ఖాతాలోకి..

ఆ డబ్బులు కలెక్టర్ ఖాతాలోకి..

కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టరీస్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పెట్రోలియం ఎక్స్ ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కు చెందిన డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజివ్స్ సభ్యులుగా ఉండే కమిటీ పర్యవేక్షణలో ప్లాంటులోని ఉత్పత్తుల విక్రయాలు జరపాలని, తద్వారా వచ్చిన సొమ్మును విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఖాతాలోనే డిపాజిట్ చేయాల్సి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కమిటీ పర్యవేక్షణలో ఉత్పత్తుల విక్రయానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ సర్కారు న్యాయవాది పేర్కొన్నారు. కాగా,

శాశ్వత మూసివేతకే సర్కారు మొగ్గు?

శాశ్వత మూసివేతకే సర్కారు మొగ్గు?


విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో గ్యాస్ దుర్ఘటనపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టినా, తర్వాతి కాలంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ప్లాంట్ ను శాశ్వతంగా మూసేయాలని, బాధితులకు పరిహారం పెంచాలని, మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హైకోర్టు సీజే ఆధ్వర్యంలోనే వాటిపై విచారణ సాగుతున్నది. ఇప్పటిదాకా సాగిన వాదనల్లో.. ప్లాంటును మళ్లీ తెరిచే విషయంలో ప్రభుత్వ విముఖత స్పష్టంగా కనిపించింది. మంగళవారం నాటి ఆదేశాల్లో ఎల్జీ పాలిమర్స్ లో మిగిలున్న ఉత్పత్తుల విక్రయాలకు అనుమతించిన కోర్టు.. ప్లాంటు మూసివేత పిటిషన్ల విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.

English summary
The high court of Andhra Pradesh allowed the interlocutory application moved by LG Polymers to move and sell leftover raw material, finished product and packaging material at its seized plant in Visakhapatnam. The court directed the company to deposit the sales proceeds in an account in the name of Vizag district collector. It also directed the sale process to be done in the supervision of a three-member committee appointed by the state government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X