విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ చేజారుతున్న విశాఖ ? - వైసీపీకి పెరుగుతున్న మద్దతు- రాజధాని ఎఫెక్ట్‌..

|
Google Oneindia TeluguNews

ఏపీ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ స్ధానం నుంచి పోటీ చేసిన వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మను ఓడించేందుకు అక్కడి టీడీపీ, బీజేపీ శ్రేణులు ఏకమయ్యాయి. విజయమ్మ గెలిస్తే కడప ఫ్యాక్షన్‌ గ్యాంగ్‌లు ఇక్కడకు వస్తాయని, భూములన్నీ కబ్జా చేస్తాయని ప్రజలను భయభ్రాంతులను చేశాయి. అలా జరక్కుండా ఉండాలంటే విద్యావంతుడైన బీజేపీ అభ్యర్ధి కంభంపాటి హరిబాబును గెలిపించాలని డిమాండ్‌ చేశాయి. ఈ వాదనను జనం కూడా నమ్మడంతో విజయమ్మ భారీ తేడాతో అక్కడ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సీన్‌ కట్‌ చేస్తే ఆరేళ్లలో అక్కడ పరిస్ధితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ భారీ సక్సెస్‌ సాధించినట్లే కనిపిస్తోంది.

విశాఖలో మారిన సీన్...

విశాఖలో మారిన సీన్...

సముద్రతీరంలో ప్రశాంతంగా కనిపించే విశాఖపట్నం నగరంలో రాజకీయాలకు కొదవే లేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ మధ్య సామాజిక వర్గాల వారీగా ఇక్కడ సాగిన హోరాహోరీ పోరు కాస్తా 2014లో వైసీపీ వర్సెస్‌ టీడీపీగా మారింది. అయితే టీడీపీ 2014 ఎన్నికల్లో అక్కడ పోటీ చేయకుండా బీజేపీతో ఎంపీ స్ధానంలో పోటీ చేయించింది. టీడీపీ మద్దతుతో బీజేపీ ఎంపీగా హరిబాబు అనాయాసంగా గెలుపొందారు. కానీ 2019 నాటికి మారిన పరిస్ధితుల్లో రాష్ట్రమంతటా వీచిన వైసీపీ పవనాలు విశాఖనూ గెలిపించి పెట్టాయి. అప్పటి నుంచి మారుతున్న పరిస్ధితుల్లో ఇప్పుడు టీడీపీ కంటే వైసీపీ అక్కడ మెరుగ్గా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం విశాఖను ఏపీ కొత్త రాజధానిగా ప్రకటించడమే. వైసీపీ విషయంలో గతంలో ప్రజల్లో ఉన్న భయాందోళనలు క్రమంగా తగ్గిపోతున్నాయనడానికి తాజాగా అక్కడ చోటు చేసుకుంటున్న పరిస్ధితులే కారణం.

విశాఖ టీడీపీ చేజారుతోందా ?

విశాఖ టీడీపీ చేజారుతోందా ?

విశాఖ నగరంలో టీడీపీ దశాబ్దాలుగా పాతుకుపోయింది. తాజాగా రాష్ట్రమంతా వైసీపీ ఫ్యాన్‌ గాలి వీచినా విశాఖలో నాలుగు సీట్లు కాస్తా టీడీపీ వశమయ్యాయి. అదే టీడీపీకి చివరి విజయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ రాజధాని ప్రకటన, గతంలో టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న నేతలు వైసీపీకి క్యూ కడుతుండటం, రూరల్‌ నియోజకవర్గాల్లో వైసీపీ హవా కొనసాగుతుండటం ఆ పార్టీకి భారీ ఊరటనిస్తోంది. అదే సమయంలో గతంలో టీడీపీలో పదవులు అనుభవించిన సీనియర్‌ నేతలు కూడా వైసీపీకి క్యూ కడుతుండటం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మారుతోంది. రాజధాని నేపథ్యంలో మారుతున్న పరిణామాలే ఈ జంపింగ్‌లకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం టీడీపీలో ఉన్న నలుగురు సిటీ ఎమ్మెల్యేల్లో కనీసం ఇద్దరు సైలెంట్‌ అయిపోవడం కూడా ఆ పార్టీకి కొరుకుడు పడటం లేదు. గంటా శ్రీనివాస్‌తో పాటు వాసుపల్లి గణేశ్‌ కూడా విశాఖ రాజధానికి వ్యతిరేకంగా గొంతెత్తేందుకు సిద్ధంగా లేకపోవడం టీడీపీని కలవరపెడుతోంది.

 వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌...

వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌...

రాజధాని ప్రకటన నేపథ్యంలో వైసీపీపై కనిపిస్తున్న సానుకూలతను సాధ్యమైనంత తక్కువ సమయంలో సొమ్ము చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ డెయిరీ ఛైర్మన్‌ కుటుంబం నుంచి మొదలైన ఆపరేషన్‌ ఆకర్ష్‌ తాజాగా పంచకర్ల రమేష్‌బాబును చేర్చుకోవడం వరకూ కొనసాగుతూనే ఉంది. ఇందులో పలువురు టీడీపీ నేతలు ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి అందులో ఉన్నవారే కావడం విశేషం. అయినా మారిన పరిస్ధితులకు అనుగుణంగా వైసీపీని నమ్ముకుంటునే మంచిదని వారు భావిస్తున్నారు. అందుకే జంపింగ్స్‌ సంఖ్య పెరుగుతోంది. అటు టీడీపీకి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పక్కచూపులు చూస్తుండటం వైసీపీకి మరింత కలిసి వస్తోంది. అయితే వైసీపీ లేదా బీజేపీలా సాగుతున్న టీడీపీ జంపింగ్స్‌ భవిష్యత్తులో తమకు కచ్చితంగా మేలు చేస్తాయనే అంచనాల్లో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.

Recommended Video

AP 3 Capitals పై High Court స్టేటస్ కో మళ్లీ పొడిగింపు- ఏపీ వికేంద్రీకరణ! || Oneindia Telugu
అందరూ భవిష్యత్తు కోసమే...

అందరూ భవిష్యత్తు కోసమే...


విశాఖలో రాజధాని ప్రకటన తర్వాత అక్కడ ఆర్ధిక వ్యవహారాలు, రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరికి వారు తమ రాజకీయ భవిష్యత్తు కోసం, స్ధానికంగా పట్టు నిలుపుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా వైసీపీ పెద్దలతో టచ్‌లోకి వెళుతున్నారు. అయితే ఇప్పుడే ఎన్నికలు లేకపోవడం, వైసీపీలోకి జంప్‌ చేస్తే రాజీనామాలు చేయాల్సి రావడం వంటి పరిస్ధితులను ప్రజాప్రతినిధులను కలవరపెడుతున్నాయి. అయినా వైసీపీ ఉప ఎన్నికలకు వెళ్లకపోవచ్చన్న అంచనాలు వారిని ఆ పార్టీవైపు మొగ్గేలా చేస్తున్నాయి. రాజధాని ప్రాంతంగా ఇక్కడ జరిగే అభివృద్దిలో భాగస్వాములు కావాలంటే అధికార పార్టీలో చేరడం కానీ, వైసీపీ నేతలతో సన్నిహితంగా కానీ మెలగాలని వారు కోరుకుంటున్నారు. దీంతో ఇప్పుడు స్టీల్‌ సిటీలో రాజకీయ వేడి సెగలు పుట్టిస్తోంది.

English summary
after ysrcp government's announcement of executive capital in visakhapatnam, local politics will be turned out positively for ruling party compare to opposition tdp rather than having four mlas in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X