విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ రుషికొండ బీచ్‌కు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్: పెరగనున్న విదేశీ పర్యాటకుల తాకిడి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మనదేశానికి చెందిన పలు బీచ్‌లు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. దేశంలోని 8 బీచ్‌లకు ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్తిఫికేషన్ లభించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. కాగా, ఇందులో విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కూడా ఉండటం విశేషం.

Recommended Video

#Visakhapatnam : Rushikonda Beach Gets International Blue Flag Certification

విశాఖపట్నం మరో రికార్డు... ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రభుత్వ ప్రకటనతోనే..!విశాఖపట్నం మరో రికార్డు... ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రభుత్వ ప్రకటనతోనే..!

రుషికొండ తోపాటు దేశంలోని 8 బీచ్‌లకు బ్లూఫ్లాగ్

రుషికొండ తోపాటు దేశంలోని 8 బీచ్‌లకు బ్లూఫ్లాగ్

కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన 8 బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను ధృవీకరిస్తూ యూఎన్ఈపీ, యూఎన్‌డబ్ల్యూటీఓ, ఎఫ్ఈఈ, ఐయూ సీఎన్‌లతో కూడిన అంతర్జాతీయ జ్యూరీ ఆమోదముద్ర వేసిందని కేంద్రమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ రుషికొండ తోపాటు శివరాజ్‌పుర్(ద్వారక, గుజరాత్), ఘోఘ్లా(డయ్యూ), కాసర్‌గోడ్ అండ్ పాడుబిదిరి(కర్ణాటక), కప్పాడ్(కేరళ), గోల్డెన్(పూరి, ఒడిశా), రాధానగర్(అండమాన్ నికోబార్ దీవులు) బీచ్‌లు ఉన్నట్లు తెలిపారు.

ఇదే తొలిసారంటూ ప్రకాశ్ జవదేకర్..

ఇదే తొలిసారంటూ ప్రకాశ్ జవదేకర్..

సముద్ర తీర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ కోసం భారత్ తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయ జ్యూరీ తృతీయ బహుమతి ప్రకటించినట్లు ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఒకేసారి 8 బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్తిఫికేషన్ రావడం ఇదే తొలిసారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లలో ఇలాంటి బీచ్‌లను వంద అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ప్రధాని మోడీ హర్షం..

ప్రధాని మోడీ హర్షం..

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పరిశుభ్రత పాటిస్తూ, పర్యావరణ పరిరక్షణకు తీసుకునే చర్యల ఆధారంగానే బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారని కేంద్రమంత్రి వివరించారు. కాగా, దేశంలోని 8 బీచ్ లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని మరిన్ని బీచ్‌లు ఈ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

ఇక రుషికొండ బీచ్‌కు విదేశీ పర్యాటకుల తాకిడి

ఇక రుషికొండ బీచ్‌కు విదేశీ పర్యాటకుల తాకిడి

కాగా, రుషికొండ బీచ్‌కు అరుగైన గౌరవం దక్కడం పట్ల మంత్రి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ హర్షం వ్యక్తం చేశారు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రావడంతో ఈ ప్రాంతం పర్యాటకానికే తలమానికంగా మారుతోందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, కాలుష్య రహిత, సురక్షిత బీచ్‌గా గుర్తింపు లభించడంతో విశాఖను సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. మరిన్ని వసతులు, సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

English summary
Rushikonda Beach and seven other beaches in India have been conferred the coveted eco-label ‘Blue Flag’. All these beaches will now be on the global map. District Collector V. Vinay Chand confirmed that a communication was received from Sanjai Jalla, Mission Leader, Blue Flag Beaches of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X