• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌కు మోదీ పెద్ద లెక్క కాదు -సోనియానే మట్టికరిపించాం -కేంద్రానికి వైసీపీ వార్నింగ్ -బీజేపీ గప్‌చుప్

|

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలకు తోడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం మొదలు కావడంతో పొలిటికల్ హీట్ రెట్టింపయింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంటును 100శాతం ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికులు, ఏపీలోని రాజకీయ పార్టీలు డిమాండ్లు చేస్తున్నాయి. ఈ అంశంపై టీడీపీ, బీజేపీ, జనసేనలు ప్రకటనలకే పరిమితమైపోగా, అధికార వైసీపీ మాత్రం రంగంలోకి దిగింది. కార్మికులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్న ఉత్తరాంధ్ర వైసీపీ ముఖ్యనేతలు ఏకంగా ప్రధాని మోదీకే తీవ్రస్థాయిలో వార్నింగ్స్ ఇచ్చారు..

  #cmjagan #ap #politics కాంగ్రెస్‌ను మ‌ట్టిక‌రిపించిన జ‌గ‌న్‌కు .. మోడీ పెద్ద లెక్క కాదు-ఎమ్మెల్యే అమ‌ర్‌నాథ్

  అదను చూసి దెబ్బకొట్టిన మోదీ -కాంగ్రెస్ పక్ష నేత ఆజాద్ పదవి గల్లంతు -జమ్మూకాశ్మీర్ అనాధఅదను చూసి దెబ్బకొట్టిన మోదీ -కాంగ్రెస్ పక్ష నేత ఆజాద్ పదవి గల్లంతు -జమ్మూకాశ్మీర్ అనాధ

  ప్లాంట్ పరిరక్షణ పోరులో వైసీపీ..

  ప్లాంట్ పరిరక్షణ పోరులో వైసీపీ..


  విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరులో భాగంగా సంస్థలో పనిచేస్తోన్న కార్మికులు సోమవారం నుంచి ఆందోళనల్ని ఉధృతం చేశారు. స్టీల్ ప్లాంట్ బి సి గేట్, బాలచెరువు రోడ్‌ వద్ద సోమవారం నిర్వహించిన నిరసన సభల్లో మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పాలుపంచుకున్నారు. అన్ని పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు పాల్గొన ఈ కార్యక్రమంలో వైసీపీ తప్ప ఇతర పార్టీల నుంచి రాష్ట్ర స్థాయి నేతలెవరూ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు..

  షాకింగ్: జలవిలయంలో 203 మంది గల్లంతు -18 మృతదేహాలే దొరికాయి: సీఎం కీలక ప్రకటనషాకింగ్: జలవిలయంలో 203 మంది గల్లంతు -18 మృతదేహాలే దొరికాయి: సీఎం కీలక ప్రకటన

  టీడీపీ, బీజేపీ దొందూ దొదే..

  టీడీపీ, బీజేపీ దొందూ దొదే..


  రాష్ట్రానికి తలమానికం లాంటి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఆ దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ, బీజేపీలకు చిత్తశుద్ది లేదని తిట్టిపోస్తోన్న వైసీపీ నేతలు.. కేంద్రం చిన్నచూపు కారణంగానే వైజాగ్ స్టీల్ ప్లాంటుకు దుస్థితి ఎదురైందని, ఇక్కడి కార్మికులు, ఉద్యోగులపై ప్రేమ లేదు కాబట్టే చంద్రబాబు కనీసం ఎలాంటి డిమాండ్ చేయడంలేదని వైసీపీ నేతలు విమర్శించారు. ఈ క్రమంలో..

  జగన్‌కు మోదీ లెక్కకాడు..

  జగన్‌కు మోదీ లెక్కకాడు..


  వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్రం తీరును తప్పుపడుతూ, తీరు మార్చుకోవాలంటూ హెచ్చరించిన అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్.. ప్రధాని మోదీని ఉద్దేశించి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘32 మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నాం. అలాంటి స్టీల్ ఫ్యాక్టరీని ఇప్పుడు నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి వచ్చి ప్రైవేటుపరం చేసేస్తాం, ఇష్టానికి అమ్మేసుకుంటామంటే ఇక్కడెవరూ చూస్తూ కూర్చోరు. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీనే మట్టికరిపించిన ఘనత వైఎస్ జగన్‌ది. ఆయనకు ప్రధాని మోదీ పెద్ద లెక్క కానేకాదు'' అని హెచ్చరించారు. అంతేకాదు..

  వైసీపీ వార్నింగ్.. బీజేపీ సైలెన్స్..

  వైసీపీ వార్నింగ్.. బీజేపీ సైలెన్స్..


  స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాసిన దరిమిలా, కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే జగన్ ఆధ్వర్యంలోనే పోరాటం కొనసాగుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. పోరాటాలు చేయడం జగన్ కు కొత్త కాదని, కేంద్రం మొండి వైఖరితో ముందుకు సాగితే.. తామూ తిరగబడతామని వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ హెచ్చరించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావిస్తూ కేంద్రం తీరుపై వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఏపీ బీజేపీ నేతలు మాట మాత్రంగానైనా స్పందింకపోవడం చర్చనీయాంశమైంది.

  English summary
  opposing the centre move of disinvestment of Visakhapatnam Steel Plant, ysrcp leaders warns pm modi to withdraw its decision. taking part of agitations at vizag city, ysrcp mla gudivada amarnath says, Modi is not a big deal to Jagan. earlier, ap cm jagan wrote a letter to pm modi on Steel plant privatisation.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X