విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ గ్యాస్ లీకేజ్ కేసు .. హైకోర్టు ఆదేశాలతో ఊపిరి తీసుకున్న ఎల్జీ పాలిమర్స్

|
Google Oneindia TeluguNews

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎల్జీ పాలిమర్స్ కు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కాస్త ఊరట కలిగే తీర్పునిచ్చింది. విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఎల్జి పాలిమర్స్ లో ఉన్న రికార్డుల నిర్వహణ కోసం ఆ సంస్థ అకౌంట్స్ విభాగ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి అనుమతినిచ్చింది. ఏపీ సర్కార్ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తర్వాత విచారణకు మాత్రమే ఎల్జీ సంస్థ అధికారులను అనుమతించింది. ఎల్జీ పాలిమర్స్ ఎలాంటి ఆపరేషన్స్ చెయ్యకుండా సీజ్ చేసింది . తాజాగా కోర్టు నిర్ణయంతో సిబ్బంది ఎల్జీ పాలిమర్స్ లోనికి వెళ్లనున్నారు .

మెజిస్ట్రేట్ ముందుకు సౌత్ కొరియన్ సీఈఓతో సహా ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులు..22 వరకు రిమాండ్ విధింపుమెజిస్ట్రేట్ ముందుకు సౌత్ కొరియన్ సీఈఓతో సహా ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులు..22 వరకు రిమాండ్ విధింపు

గ్యాస్ లీక్ ఘటన తర్వాత ఎల్జీ పాలిమర్స్ మూసివేత

గ్యాస్ లీక్ ఘటన తర్వాత ఎల్జీ పాలిమర్స్ మూసివేత

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్దుర్ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సీఈవో, డైరెక్టర్లు సహా 12 మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఎల్జీ పాలిమర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈవో సుంకి జియోంగ్ ,టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్ తదితరులనుఅరెస్ట్ చేసిన పోలీసులు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత చర్యలు తీసుకున్నారు. ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన తర్వాత ఎల్జి పాలిమర్స్ కంపెనీ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా సీజ్ చేశారు.

అకౌంట్స్ సిబ్బంది లోనికి వెళ్ళేలా ఆదేశాలు .. సీసీ కెమెరాలతో రికార్డ్ చెయ్యాలన్న కోర్టు

అకౌంట్స్ సిబ్బంది లోనికి వెళ్ళేలా ఆదేశాలు .. సీసీ కెమెరాలతో రికార్డ్ చెయ్యాలన్న కోర్టు

ఏపీ ప్రభుత్వ కఠిన చర్యలతో వరుస ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎల్జి పాలిమర్స్ సంస్థకు హైకోర్టు కాస్త ఊరట కలిగించే విషయం చెప్పింది.

ఎల్జి పాలిమర్స్ సంస్థ లోపల రికార్డుల నిర్వహణ కోసం 16 మంది ఆ సంస్థ అకౌంటింగ్ విభాగ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి అనుమతినిచ్చిన ఏపీ హైకోర్టు ఎల్జీ పాలిమర్స్ లో వారు వెళ్ళే ప్రాంగణాన్ని సీసీ కెమెరాలతో రికార్డు చేయాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ లలిత తో కూడిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

Recommended Video

AP CM Jagan : మేనమామగా మారిన సీఎం జగన్.... మీరు చదవండి నేను చదివిస్తా... రూ.650 కోట్ల ఖర్చుతో...!!
 గ్యాస్ లీక్ దుర్ఘటన నుండి కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఎల్జీ పాలిమర్స్

గ్యాస్ లీక్ దుర్ఘటన నుండి కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఎల్జీ పాలిమర్స్


ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనతో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఎల్ జి పాలిమర్స్ దుర్ఘటనపైసమగ్ర విచారణ కు కమిటీని నియమించింది. విచారణ జరిపినహైపవర్ కమిటీబాధిత గ్రామాల ప్రజల అభిప్రాయాలను, గ్యాస్ లీక్ ఘటనకు గల కారణాలను, అటు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య వివరణను ,సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన అభిప్రాయాలనునమోదు చేసింది. అంతేకాదు ప్రమాదం జరిగిన తీరును, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండాతీసుకోవలసిన జాగ్రత్తలను హైపవర్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. హైపవర్ కమిటీ నివేదిక తర్వాత ఎల్జి పాలిమర్స్ పై కఠిన చర్యలకు దిగింది ఏపీ ప్రభుత్వం.

అప్పటి నుండి ఇప్పటి వరకు కోర్టులో ఎల్జీ పాలిమర్స్ విచారణ ఎదుర్కొంటూనే ఉంది .

English summary
The Andhra Pradesh High Court has ordered the government about that LG Polymers, which is facing trial in the Visakhapatnam LG Polymers gas leakage case. The High Court bench hearing the petitions filed in the High Court on the Visakhapatnam gas leakage accident allowed the staff of the Accounts Division of the company to go inside for the maintenance of records in LG Polymers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X