విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో టీడీపీ వీక్ .. చంద్రబాబుకు షాక్ .. నేడు సీఎం జగన్ ను కలవనున్న మరో ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

ఏపీలో తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది . వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విశాఖలోని టిడిపి నాయకులు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ నేతలు పలు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో విశాఖను రాజధానిగా టిడిపి వ్యతిరేకించడాన్ని విశాఖలోని చాలా మంది టీడీపీ నాయకులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాల బాట పడుతున్నారు. వైసీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.

విశాఖలో చంద్రబాబుకు షాక్... వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల .. రేపే ముహూర్తంవిశాఖలో చంద్రబాబుకు షాక్... వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల .. రేపే ముహూర్తం

వైసీపీకి జై కొట్టనున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్

వైసీపీకి జై కొట్టనున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్

తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా వైసీపీకి జై కొట్టనున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇటీవల వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే . ఇక తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఈ రోజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవనున్నారు . తెలుగుదేశం పార్టీ నుండి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్న వాసుపల్లి గణేష్ ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి చర్చలు జరపనున్నారు. తన మద్దతును ప్రకటించనున్నారు.

వల్లభనేని వంశీ , కారణం బలరాం , మద్దాలి గిరి బాటలో

వల్లభనేని వంశీ , కారణం బలరాం , మద్దాలి గిరి బాటలో

వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి బాటలోనే ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరకుండానే జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపనున్నట్లుగా సమాచారం. గత కొద్ది రోజులుగా తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వాసుపల్లి గణేష్, వైయస్సార్ సిపి పెద్దలతో టచ్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. విశాఖ రాజధానిగా టిడిపి వ్యతిరేకిస్తున్న కారణంగానే ఆయన టీడీపీని వీడి, వైసిపి కి మద్దతుగా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు గా సమాచారం.

పార్టీ కండువా కప్పుకోకుండానే వైసీపీకి మద్దతు

పార్టీ కండువా కప్పుకోకుండానే వైసీపీకి మద్దతు

పార్టీ కండువా కప్పుకోకుండానే ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చి వైసిపికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా వాళ్ల బాటలోనే పయనించన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం 23 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టిడిపి, 23 మంది ఎమ్మెల్యేల నుండి ఒక్కొక్కరుగా వైసీపీ వైపు జంప్ అవడంతో ఇబ్బంది ఎదుర్కొంటుంది. అటు అధికార పార్టీతో ప్రతిరోజు యుద్ధం చేస్తున్న టిడిపికి తాజాగా మరో ఎమ్మెల్యే జంప్ అవుతున్నారన్న అంశం పెద్ద షాక్ అని చెప్పాలి.

విశాఖలో బలహీనంగా టీడీపీ

విశాఖలో బలహీనంగా టీడీపీ

ఇప్పటికే విశాఖపట్నంలో గతంలో మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాస రావు సైలెంట్ కాగా , తాజాగా పంచకర్ల రమేష్ బాబు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనుండటం చంద్రబాబుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పడం, టీడీపీని వీడి వైసీపీలో చేరితే అనర్హత వేటు వేసే అవకాశం ఉండడం వంటి కారణాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు.

Recommended Video

YSR Arogya Asara Scheme ఆర్థిక సాయం పెంపు..సాధారణ ప్రసవానికి రూ.5000/- సిజేరియన్‌కు రూ.3000/-
అధికారికంగా చేరకుండానే జగన్ పాట పాడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు

అధికారికంగా చేరకుండానే జగన్ పాట పాడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ, అధికారికంగా పార్టీలో చేరకుండా టిడిపి ఎమ్మెల్యేలు జగన్ పాట పాడుతున్నారు. ఇక టీడీపీని వీడి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇదే దారిలో నడుస్తారు అన్న ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ తన పట్టును కోల్పోతున్నట్లుగా తాజా రాజకీయ పరిణామాలతో అర్థమవుతుంది.

English summary
Another shock to the TDP in Vishakha district. MLA Vasupalli ganesh ready to support to ycp.Vasupalli Ganesh, MLA from Visakhapatnam South,who has decided to quit the Telugu Desam Party, will hold talks with CM YS Jagan Mohan Reddy this afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X