protest central government tdp cpm vishakhapatnam ప్రైవేటీకరణ నిరసన అవంతి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం టిడిపి సిపిఎం విశాఖపట్నం politics vizag land scam Visakhapatnam Steel Plant
విశాఖ ఉక్కు ఉద్యమం .. అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ , ఆందోళన ఉధృతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో విశాఖ ఉక్కు ఉద్యమం మొదలైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళనలు ఉధృతమయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా కార్మికులు ఆందోళన బాట పట్టారు. అఖిలపక్ష పార్టీల సహకారంతో కార్మిక పోరాటం ఉధృతమవుతోంది.


విశాఖ స్టీల్ ప్లాంట్ బ్యాక్ గేట్ వద్ద అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో నిరసన
ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ బ్యాక్ గేట్ వద్ద అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అఖిలపక్ష నాయకులు, కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ఆందోళనకు మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో అన్ని పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యమం కారణంగా ఆవిర్భవించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదే ఉద్యమస్ఫూర్తితో కాపాడుకుంటామని కార్మికులు పేర్కొన్నారు.

కార్మిక పోరాటానికి మద్దతుగా అన్ని పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలలో ఉందని విస్తరణ కారణంగానే రుణాలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్న నాయకులు ప్రస్తుతం నష్టాల్లో ఉండడానికి తాము కారణం కాదని తేల్చి చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల లక్షకు పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడిన కార్మికులు జీవనోపాధి కోల్పోతారని , వారి బ్రతుకులు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికుల ఆందోళనలో పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు కార్మిక పోరాటానికి మద్దతు ప్రకటించారు.

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదన్న అఖిలపక్ష నేతలు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని అఖిలపక్ష నేతలు తేల్చి చెబుతున్నారు . విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొనసాగుతున్న కార్మికుల ఆందోళనలో మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు వైసిపి ఎంపీలు ఎం వివి సత్యనారాయణ , బి సత్యవతి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి తోపాటు పలువురు పాల్గొని కార్మికులకు తమ మద్దతు ప్రకటించారు.
కేంద్రం నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు .