ycp ap government resignation center withdrawal struggle tdp cpm bike rally vishakhapatnam ప్రైవేటీకరణ వైసీపీ ఏపీ ప్రభుత్వం బొత్సా సత్యనారాయణ రాజీనామా కేంద్రం ఉపసంహరణ పోరాటం టిడిపి సిపిఎం విశాఖపట్నం politics
విశాఖ ఉక్కు ఉద్యమం : ప్రభుత్వంతో చర్చించాకే నిర్ణయమన్న బొత్సా , రాజీనామాకు రెడీ అన్న వైసీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించడంతో ఉద్యమం ఊపందుకుంది. . విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధికార వైసీపీ ని ఇరకాటంలో పడేస్తోంది. అటు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రాలేని పరిస్థితిలో ఏపీ సర్కార్ ఉన్నప్పటికీ, విశాఖ ప్రాంతానికి చెందిన వైసీపీ మంత్రులు, నేతలు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో నోరు విప్పక తప్పడం లేదు. అయితే అలోచించి చెప్తామని బొత్సా చెప్తుంటే , రాజీనామాకైనా రెడీ అంటున్నారు వైసీపీ ఎంపీ .
"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు".. ప్రైవేటీకరణ ఒప్పుకోం : కేంద్రానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు అల్టిమేటం

ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని చెప్పిన బొత్సా సత్యన్నారాయణ
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల మనోభావాలతో కూడుకున్నదని ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని కానీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించలేదు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో ఏ స్టాండ్ తీసుకోవాలో అన్న డైలమాలో ఉంది వైసీపీ సర్కార్ .

ప్రజల సెంటిమెంట్ తో కూడుకున్న అంశం కాబట్టి ఆలోచిస్తున్నామన్న మంత్రి
విశాఖ ఉక్కు పరిశ్రమ కు కొంత నష్టాలు వచ్చాయని సుమారు 25 వేల నుండి 30 వేల కోట్ల వరకు నష్టం ఉందని దాన్ని అధిగమించడం కోసం కేంద్ర ప్రభుత్వం వారికున్న పారిశ్రామిక విధానాన్ని తీసుకున్నదని పేర్కొన్నారు బొత్సా సత్యనారాయణ. ఏదేమైనా ప్రజల సెంటిమెంట్ తో కూడుకున్న అంశం కాబట్టి దీనిపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మాట్లాడతానని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పేర్కొన్నారు.

స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవటానికి దేనికైనా రెడీ అన్న ఎంపీ ఎంవివి సత్యనారాయణ
స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించిన ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవడం కోసం తాము దేనికైనా సిద్ధం అంటూ ప్రకటించారు . అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోమని పేర్కొన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని లేదంటే స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద నిరాహార దీక్షకు దిగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇక స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, పార్లమెంటులో స్టీల్ ప్లాంట్ అంశంపై గళమెత్తుతామని పేర్కొన్నారు .

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతుందని చెప్పిన ఎంపీ
ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని స్పష్టం చేసిన వైసీపీ ఎంపీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతుందని తెలిపారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగులు, కార్మిక సంఘాలు నిరసన బాట పట్టారు. ఆందోళనలు చేపట్టారు . ప్రతిపక్ష పార్టీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయటాన్నిఅడ్డుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. అవసరమైతే ఏపీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.