విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిశీధి రాత్రిలో బస్సు బ్రేకు ఫెయిల్.. ఘాట్ రోడ్డులో బోల్తా.. ముగ్గురి మృతి

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం : నిశీధి రాత్రిలో ఘాట్ రోడ్డులో ప్రయాణం. అది సాదా సీదా రహదారి కాదు. సడెన్‌గా బ్రేకులు ఫెయిల్. ఆ బస్సుల్లో 40 మంది ప్రయాణికులు డ్రైవర్‌పై భారం పెట్టి ట్రావెల్ చేస్తున్నారు. బ్రేకులు పడలేదు, బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. నిద్రలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మరో 37 మంది గాయపడటంతో చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు.

కబళించిన మృత్యువు ..
విశాఖ జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ప్రమాదానికి కారణం బ్రేకులు ఫెయిలవడమేనని స్థానికులు చెప్తున్నారు. బస్సులో 40 మంది ప్రయాణికులు, డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. అప్పటికే వేగంతో ఉన్న బస్సు .. బ్రేకులు ఫెయిలవడంతో బోల్తా పడింది. అందులో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపు ప్రమాదం జరిగింది. బస్సు కుదుపునకు గురవడంతో ముగ్గురు మహిళా ప్రయాణికులు చనిపోయారు. మిగతా 37 మందిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు.

vizag ghat road bus roll over, 3 dead

వర్షంతో ఆటంకం ...
బస్సు బోల్తా పడిన సమయంలో ఆ ప్రాంతంలో వర్షం కురుస్తోంది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ఇబ్బది కలిగింది. దాదాపు 3 గంటలపాటు కష్టపడి ఎలాగోలా క్షతగాత్రులను వెలికితీశారు. బాధితుల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడగా గుర్తించారు. వీరంతా ఒడిశాలోని రాయ్‌గఢ్ మజ్జిగౌరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లి .. తిరిగివస్తోండగా ప్రమాదం సంభవించింది. తమ తోటి మహిళ ప్రయాణికులు చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తున్నారు.

English summary
A private travel bus crashed into the Vandtlamamdi Ghat Road at Visakha District at around 12.30 am Locals say the cause of the accident was brakes failing. The bus had 40 passengers, a driver and a cleaner. The bus was already fast .. The breakes fell off and rolled over.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X