విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైజాగ్‌లో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం, దారిపొడవునా మానవహారం..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్టణాన్ని ప్రకటించబోతారనే ఊహాగానాల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలిసారి వైజాగ్ చేరుకొన్నారు. విశాఖ ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభించేందుకు సీఎం జగన్ స్టీల్ సిటీకి వచ్చారు. ఈ క్రమంలో జగన్‌కు దారిపొడవునా ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.

మధ్యాహ్నాం విజయవాడ నుంచి వైజాగ్ బయల్దేరారు సీఎం జగన్. వైజాగ్ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్ వేదిక వద్దకు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్మించారు. దారి పొడవునా ప్రజలకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై పూలవర్షం కూడా కురిపించారు. బెలూన్లను గాలిలోకి విసిరి తమ అభిమానాన్ని చాటుకొన్నారు. ముసలి, ముతకలు కూడా జగన్ కోసం నిరీక్షించడం విశేషం. ప్లకార్డులు, జెండాలు పట్టుకొని సీఎం జగన్‌ను వెల్ కం చెప్పారు.

vizag people warm welcome to cm jagan mohan reddy

దారిలో సీఎం జగన్‌కు మానవహరంతో ధన్యవాదాలు చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించే నేపథ్యంలో 394.50 కోట్లను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. బోస్టన్ కమిటీ నివేదిక రాగానే హై వపర్ కమిటీని నియమిస్తారు. హై పవర్ కమిటీ రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. రాజధాని మార్పు ప్రక్రియను జగన్ ప్రభుత్వం పూర్తిచేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

English summary
vizag people warm welcome to cm jagan mohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X