విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎల్జీ పాలిమర్స్ టీమ్ కు వైజాగ్ పోలీసుల షాక్- కొరియా వెళ్లకుండా అడ్డుకట్ట- విమానం వెనక్కి...

|
Google Oneindia TeluguNews

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై దర్యాప్తు కోసం దక్షిణ కొరియా నుంచి వచ్చిన దర్యాప్తు బృందానికి విశాఖ పోలీసులు అనుకోని షాక్ ఇచ్చారు. దర్యాప్తు పూర్తి చేసుకుని కొరియాకు పయనమవుతున్న తరుణంలో వీరిని విశాఖ ఎయిర్ పోర్టులోనే వీరిని అడ్డుకున్నారు. కొరియా నుంచి వీరిని తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రత్యేక విమానంలో వీరు వెళ్లాల్సి ఉండగా... పోలీసులు అనుమతి నిరాకరించడంతో విమానం వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.

టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రలోభాలు ?- వైజాగ్ వెళ్లని కారణమిదేనా - సాయిరెడ్డి ట్వీట్ల వెనుక ?టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రలోభాలు ?- వైజాగ్ వెళ్లని కారణమిదేనా - సాయిరెడ్డి ట్వీట్ల వెనుక ?

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం నేపథ్యంలో దక్షిణకొరియాలోని మాతృసంస్ధ ఎల్జీ కెమికల్స్ కు చెందిన 8 మంది దర్యాప్తు బృందం విశాఖ వచ్చింది. గ్యాస్ లీక్ కు గల కారణాలు తెలుసుకోవడం, స్ట్రైరీన్ గ్యాస్ ను తిరిగి కొరియాకు తరలించడం, గ్యాస్ లీకేజీ ప్రభావాన్ని అంచనా వేసి నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు స్ధానిక అధికారులు, బాధితులకు తగు సూచనలు చేసేందుకు ఈ బృందం రెండు వారాల క్రితం విశాఖ వచ్చింది. అయితే దర్యాప్తు పూర్తి కావడం, స్టేరీన్ గ్యాస్ తరలింపు పూర్తి కావడం, సూచనలు, సలహాలు కూడా ఇచ్చేయడంతో ఇక తమ పని పూర్తయినట్లు భావించి ఈ బృందం తిరుగు పయనమైంది.

vizag police denies departure of lg polymers team members to south korea

అయితే ఎల్జీ పాలిమర్స్ కేసులో దాదాపు 7 విచారణ కమిటీలు దర్యాప్తు సాగిస్తుండటం, అవసరమైతే కొరియా బృందం నుంచి సైతం వివరాలు సేకరించాల్సిన అవసరం ఉండటంతో ఇదంతా పూర్తయ్యాకే తిరిగి కొరియా వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం పోలీసులు వీరిని కొరియా వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే ఇందులో టీమ్ హెడ్ కు మాత్రమే కొరియా వెళ్లేందుకు అనుమతి ఉండటంతో ఆయన్ను మాత్రం పంపించి మిగతా వారికి విశాఖలో వారు బసచేసిన హోటళ్లకు పోలీసులలు పంపినట్లు తెలుస్తోంది.

English summary
visakhapatnam police have denied lg polymers technical team's depature to south korea from vizag airport. police clarified that due to high court orders they have denied korean team's departure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X