విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ టీడీపీలో ముసలం: అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ రాజీనామా: సీఎం సమక్షంలో వైసీపీలోకి..!

|
Google Oneindia TeluguNews

విశాఖ టీడీపీలో ముసలం మొదలైంది. విశాఖ అర్బన్ టీడీపీ అధ్యక్షుడు రెహ్మాన్ పార్టీకి రాజీనామా చేసారు. ఎన్నార్సీ..రాజధాని అంశాల్లో టీడీపీ వైఖరిని నిరిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజు ల క్రితం విశాఖకు చెందిన టీడీపీ నేతలు సమావేశమయ్యారు. పార్టీ అధినేత జై అమరావతి అని..రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా మాట్లాడటం పైన వారు అంతర్గత సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేసారు. పార్టీ తీరు ఎలా ఉన్నా..తాము మాత్రం పరిపాలనా రాజధాని విశాఖలో రావటాన్ని స్వాగతించారు.

ఆ సమయంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలతో పాటుగా కొందరు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అదే సమావేశంలో విశాఖ అర్బన్ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న రెహమాన్ సైతం హాజరయ్యారు. అయితే, ఆయన టీడీపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం ప్రకటించారు. ఎన్నార్సీ విషయంలో కేంద్రానికి టీడీపీ మద్దతివ్వటం..అదే విధంగా విశాఖకు రాజధానికి వ్యతిరేకంగా పార్టీ వైఖరి ఉండటంతో రాజీనామా చేస్తున్నట్లు రెహమాన్ ప్రకటించారు. అయితే, పార్టీ ఇదే వైఖరితో ఉంటే మరి కొంత మంది విశాఖ టీడీపీ నేతలు పార్టీ వీడటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Vizag Urban TDP president Rehman resign for party against NRC and Capital issues

28న సీఎం సమక్షంలో వైసీపీలోకి..
టీడీపీకి రాజీనామా చేసిన విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు రెహమాన్ వైసీపీలో చేరాలని నిర్ణయించారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. పార్లమెంట్ లోని ఉభయ సభల్లో కేంద్ర ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు టీడీపీ..వైసీపీ రెండు పార్టీలు మద్దతిచ్చాయి.

అయితే, తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఏపీలో మాత్రం ఎన్నార్సీ అమలు చేసేది లేదని స్పష్టం చేసారు. అదే విధంగా..ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఇప్పటికే శాసనసభా వేదికగా సంకేతాలిచ్చారు. ఇక, దీని పైన శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశం లో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీ మాత్రం తాము అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకమని స్పష్టం చేసారు. దీంతో..ఎన్నార్సీ విషయం తో పాటుగా విశాఖకు పరిపాలనా రాజధాని మార్పుకు తమ అధినాయకత్వం వ్యతిరేకంగా ఉండటంతో పార్టీ వీడాలని నిర్ణయించినట్లు రెహమాన్ స్పష్టం చేసారు.

మరి కొందరు నేతలు సైతం..

రెహమాన్ బాటలోనే మరి కొందరు విశాఖ నేతలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పార్టీ వైఖరి మీద ప్రస్తుత..మాజీ విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు..పార్టీ నేతలు అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం కేబినెట్ లో విశాఖకు పరిపాలనా కేంద్రాన్ని తరలిస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరువాత..

పార్టీ పరంగా వచ్చే స్పందనను చూసిన తరువాత నిర్ణయం తీసుకొనే ఆలోచనలు విశాఖ టీడీపీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పుడు అమరావతి రాజధాని వ్యవహారం ఇప్పటి వరకు అమరావతి లో ఆందోళనలకు కారణం కాగా..ఇక, ఇప్పుడు రాజకీయంగా ప్రకంపణలకు కారణమవుతోంది.

English summary
Vizag urban TDP president Rehman resigned for party against party supproting NRC and non support og capital shifting to Vizag. Speculation that some more Vizag tdp leaders are in same way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X