విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కాటు: వైయస్సార్సీ కీలక నేత ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కరోనా మహమ్మారికి మరో రాజకీయ నేత ప్రాణాలు కోల్పోయారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్(59) ఆదివారం కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకవడంతో విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆ తర్వాత శ్రీనివాస్‌కు కరోనా నెగిటివ్ వచ్చినా ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ద్రోణంరాజు కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

VMRDA chairman and ysrcp leader Dronamraju Srinivas Passed Away.

ద్రోణంరాజు శ్రీనివాస్.. దిగవంగత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు. తండ్రి బాటలోనే ఈయన కూడా రాజకీయాల్లోకి వచ్చి కీలక నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Recommended Video

YCP తీర్థం పుచ్చుకోనున్న గంటా వారు.. రేపే పార్టీ లో చేరిక! || Oneindia Telugu

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.
2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు శ్రీనివాస్. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం ఆయనకు కీలకమైన విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

సీఎం జగన్ సంతాపం

ద్రోణంరాజు శ్రీనివాస్‌ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.​ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్‌ మరణం విశాఖ ప్రజలకు తీరనిలోటు అని అన్నారు. ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సీఎంతోపాటు పలువురు రాజకీయ నేతలు ద్రోణంరాజు మృతి పట్ల సానుభూతి తెలియజేశారు.

English summary
VMRDA chairman and ysrcp leader Dronamraju Srinivas Passed Away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X