విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డాక్టర్ సుధాకర్‌పై దాడిచేసినవారిని అరెస్ట్ చేయాలి, ఆరోగ్యం క్షీణిస్తోంది: తల్లి కావేరి భాయి

|
Google Oneindia TeluguNews

డాక్టర్ సుధాకర్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతని తల్లి కావేరి బాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుధాకర్ ఆరోగ్యంగా ఉన్నాడని.. కానీ మానసిక రోగి అని ముద్రవేస్తున్నారని ఆరోపించారు. మెంటల్ ఆస్పత్రిలో పెట్టడం వల్ల నిరసించిపోయాడని గుర్తుచేశారు. ఓ డాక్టర్‌పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని కావేరిబాయి అన్నారు.

సుధాకర్ చేసిన తప్పు ఏంటి అని ఆమె ప్రశ్నించారు. ఎన్ 95 మాస్క్‌లు లేవని అంటే అరెస్ట్ చేసి.. మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారా అని నిలదీశారు. సమస్యను కోర్టు దృష్టికి తీసుకెళ్లామని.. ప్రజసంఘాలు, మేధావులు కూడా మద్దతు తెలుపుతున్నారని కావేరిభాయి గుర్తుచేశారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు అని పేర్కొన్నారు. ప్రభుత్వ వేధింపులతో అతను చిక్కిపోయాడని... ఆరోగ్యం క్షీణిస్తోందని కావేరి భాయి బాధపడ్డారు. అతని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి షిప్ట్ చేయాలని కోరారు. మరోవైపు సుధాకర్ కూడా మెంటల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.

who attack sudhakar should be arrest:mother kaveri bhai

రాష్ట్రంలో ఎన్ 95 మాస్క్‌లు లేవని అనడంతో అనస్థిషీయా డాక్టర్ సుధాకర్‌ వెలుగులోకి వచ్చారు. తర్వాత అతనిపై పోలీసులు కేసు నమోదు చేయడం.. గుండుతో కనిపించడంతో పోలీసుల చర్యలపై విమర్శలు వచ్చాయి. దీనిపై సుధాకర్ తల్లి హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే దానిని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించింది. అతనిని విశాఖ మానసిక వైద్యశాలకు తరలించి.. అక్కడే ఉంచారు. దీంతో తన మానసిక పరిస్థితి బాగానే ఉంది అని సుధాకర్ పేర్కొన్నారు.

English summary
who attack doctor sudhakar should be arrest mother kaveri bhai demand to andhra pradesh government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X