విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్ గొప్పతనం తెలియక ఓడించాం .. 85 లక్షల మంది తరపున క్షమాపణలు చెప్పిన కార్మికుడు

|
Google Oneindia TeluguNews

ఏపీ లో నెలకొన్న ఇసుక కొరత నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి భవన నిర్మాణ కార్మికుడు ఉద్వేగంగా మాట్లాడారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గొప్పతనం తెలియక ఓడించామని,ఇప్పుడు ఆయన గొప్పదనం, మంచితనం తెలిసి 85 లక్షల కార్మికుల తరఫున క్షమాపణ అడుగుతున్నామని సభా ముఖంగా పేర్కొన్నారు.

విశాఖ లాంగ్ మార్చ్ లో సభాముఖంగా భావన నిర్మాణ కార్మికుల ఆవేదన

విశాఖ లాంగ్ మార్చ్ లో సభాముఖంగా భావన నిర్మాణ కార్మికుల ఆవేదన

విశాఖ వేదికగా జరిగిన లాంగ్ మార్చ్ లో పాల్గొన్న భవన నిర్మాణ కార్మికులు, ఆ తరువాత జరిగిన సభలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు పడరాని పాట్లు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్రోశం వెళ్లగక్కారు. అంతేకాదు ఐదు నెలలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన చెందారు. ఇప్పటికి ఉపాధి లేక 36 మంది భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్నా స్పందించిన నాథుడు లేడని, ఆ సమయంలోనే మీకోసం నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ .. జగన్ స్పందిస్తారా ? పవన్ అన్నంత పని చేస్తారా ?వైసీపీ ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ .. జగన్ స్పందిస్తారా ? పవన్ అన్నంత పని చేస్తారా ?

 పవన్ కళ్యాణ్ కార్మికుల సమస్యలు విని స్పందిచారన్న నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు

పవన్ కళ్యాణ్ కార్మికుల సమస్యలు విని స్పందిచారన్న నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు


ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు తోరం రాజు గత ఐదు నెలలుగా నిర్మాణరంగ కార్మికులు పడుతున్న పాట్లను, అనుభవిస్తున్న కష్టాలను సభాముఖంగా తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ చాలా మంచి మనసుతో మంగళగిరి పార్టీ ఆఫీసులో భవన నిర్మాణ కార్మికులకు కలిశారని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని ఆ తర్వాత రెండు రోజులకే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

పవన్ గొప్ప వ్యక్తి .. ఓడించి తప్పు చేశామన్న కార్మికుడు రాజు

పవన్ గొప్ప వ్యక్తి .. ఓడించి తప్పు చేశామన్న కార్మికుడు రాజు

నిర్మాణ రంగ కార్మికులకు అండగా ఉండటానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా చాలామంది తప్పు పట్టారని, కానీ అన్ని పార్టీలు ఏకతాటి మీదకు వచ్చి సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజు పేర్కొన్నారు. నిర్మాణ రంగ కార్మికులకు న్యాయం చేయాలనే భావన తప్ప ఇందులో ఎలాంటి కల్మషం పవన్ కు లేదని రాజు పేర్కొన్నారు. ఇంత గొప్ప వ్యక్తిని ఓడించి తప్పు చేశామని, అందుకు తాను సైతం బాధ్యుడనని సభా ముఖంగా క్షమాపణలు కోరారు రాజు.

85 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల తరపున క్షమాపణలు చెప్పిన రాజు

85 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల తరపున క్షమాపణలు చెప్పిన రాజు

సమస్యలపై పోరాటం అంటే ముందుండే నాయకుడు పవన్ కళ్యాణ్ అని రాజు పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో ఈ విషయం తెలియక రాష్ట్రంలోని 85 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జనసేన పార్టీని ఓడించి తప్పు చేశారని, అందుకు సభాముఖంగా క్షమాపణలు అని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజు ఉద్వేగంగా మాట్లాడారు. పవన్ స్వార్ధం లేని నాయకుడని మాట్లాడారు. పవన్ పిలుపు మేరకు నిర్మాణరంగ కార్మికులు ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నారన్నారు .

అఖిలపక్షం ఏర్పాటు చెయ్యటం గొప్ప ఆలోచన .. అది తప్పు కాదన్న కార్మికుడు

అఖిలపక్షం ఏర్పాటు చెయ్యటం గొప్ప ఆలోచన .. అది తప్పు కాదన్న కార్మికుడు

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు ముందుండి చేసే పోరాటానికి కార్మికులు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. కానీ గత ఎన్నికల్లో చేసిన తప్పుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నామని భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు, నిర్మాణ కార్మికుల అందరి పక్షాన పవన్ కు క్షమాపణలు చెప్పారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి నిర్మాణ రంగ కార్మికుల కోసం పోరాటం చేయాలనే ఆలోచన మంచి ఆలోచన అని, ఆయనకు కార్మికులు ఎప్పుడూ అండగా ఉంటారని, ఏ స్వార్ధం లేని రాజకీయాలు చేసే పవన్ పార్టీ కి తాము చేసింది అన్యాయమని చాలా ఉద్వేగంగా మాట్లాడారు .

English summary
In the wake of the shortage of sand in AP, Janasena chief Pawan Kalyan conducted a long march in Vishakha. The construction worker spoke about Pawan Kalyan, who organized the Long March for Construction Workers. "Pawan Kalyan has been defeated in the last election without knowing the merits and now he apologizes on behalf of 85 lakh workers for pawan's greatness
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X