విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అహా నా పెళ్లంట.. ప్లాస్టిక్ లేదంట.. అతిథులకు ఆనాటి మర్యాదలు గ్రేటంట

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం : ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్. గల్లీ, ఢిల్లీ.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ రాజ్యమేలుతోంది. పట్టణాలే కాదు పల్లెలకు కూడా విస్తరించింది ప్లాస్టిక్ భూతం. అసలు నేను లేకుండా పండుగలు, పబ్బాలు ఎలా చేసుకుంటారు అనే రేంజ్‌లో ప్లాస్టిక్ భూతం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్లాస్టిక్ వాడకంలో చదువులేనోళ్ల నుంచి చదువుకున్నవాళ్ల వరకు ఎవరూ అతీతులు కారేమో. పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకంపై మేధావులు మొత్తుకుంటున్నా.. పట్టించుకునేవారే కరువయ్యారు.

అదలావుంటే విశాఖపట్నంలో జరిగిన పెళ్లి వేడుక స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ప్లాస్టిక్ వస్తువుల జోలికి వెళ్లకుండా ఓ కుటుంబం నిర్వహించిన వివాహ తంతు ఆలోచన రేకెత్తిస్తోంది. శ్రమ అనుకోకుండా కాసింత దృష్టి పెడితే ప్లాస్టిక్ లేని పండుగలు ఓ రేంజ్‌లో చేసుకోవచ్చని నిరూపించింది.

పచ్చని పెళ్లి పందిరి.. అతిథుల ప్రశంసలు

పచ్చని పెళ్లి పందిరి.. అతిథుల ప్రశంసలు

విశాఖపట్నంలో ఆదివారం నాడు జరిగిన ఓ పెళ్లి వేడుక ఔరా అనిపించింది. పచ్చని పెళ్లి పందిరిలో నవ వధువులను పదికాలాల పాటు పచ్చగా దీవించాలని అతిథులు దీవించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్లాస్టిక్ వస్తువులు కనిపించకుండా వివాహ వేడుక జరగడం ప్రశంసల వర్షం కురిపించింది.

పెళ్లి చేయాలంటే మామూలు విషయం కాదు. పెళ్లి ముహుర్తం దగ్గర్నుంచి బంధువులను ఆహ్వానించడం వరకు.. పెళ్లికి కావాల్సిన సామాగ్రి నుంచి అతిథుల మర్యాదల వరకు అదో పెద్ద ప్రహసనమే. అలాంటిది పద్దతి ప్రకారం ప్లాస్టిక్ వస్తువుల జోలికి వెళ్లకుండా పర్యావరణ పరిరక్షణ సారం వెల్లడిస్తూ జరిగిన ఈ పెళ్లి వేడుక పలువుర్ని ఆకట్టుకుంది.

ప్రేమ కొంప ముంచింది.. లవర్ కోసం సొంతింట్లో దొంగతనం.. ఓ యువతి ప్రేమకథప్రేమ కొంప ముంచింది.. లవర్ కోసం సొంతింట్లో దొంగతనం.. ఓ యువతి ప్రేమకథ

అంతా పచ్చదనమే.. సహజసిద్దమే..!

అంతా పచ్చదనమే.. సహజసిద్దమే..!

బెంగళూరులో నివాసం ఉండే కాంతిరత్న, అరుణ్‌ దంపతులు. పర్యావరణం పరిరక్షణ గురించి తపించే ఆ దంపతులు వారి ఆలోచనలు అక్కడికే పరిమితం చేయలేదు. ఆచరణ రూపంలో పెట్టారు. వారి కుమార్తె అదితి వివాహాన్ని గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు. దాంతో ఆ వివాహ వేడుకలో ప్లాస్టిక్ వస్తువుల జోలికి వెళ్లకుండా ప్లాన్ చేశారు. బంధువులు విశాఖలోనే అత్యధికంగా ఉండటంతో కన్వినెంట్‌గా ఉంటుందని ఇక్కడే నిర్వహించారు.

ముంబైకి చెందిన వరుడు సౌమిత్రతో ఆదివారం నాడు జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. పర్యావరణానికి విఘాతం కలిగించని వస్తువులు వాడి శభాష్ అనిపించుకున్నారు. కల్యాణ మండపం అలంకరణకు ఆకులు, పువ్వుల్ని వినియోగించారు. మండపంపై కొబ్బరాకులను వాడి అందంగా ముస్తాబు చేశారు. మండపానికి నాలుగు వైపులా అరటి కాండలు కట్టారు. మధ్యమధ్యలో మొగలి రేకులతో అందంగా అలంకరించారు.

కలర్స్ లేవు.. కెమికల్స్ లేవు.. ఆహారం, నీరు వృధా కాలేదు..!

కలర్స్ లేవు.. కెమికల్స్ లేవు.. ఆహారం, నీరు వృధా కాలేదు..!


ఇక విందు విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి కెమికల్స్, రంగులు వాడకుండా తయారుచేసిన వంటకాలను అతిథులకు రుచి చూపించారు. మంచినీరు తాగేందుకు పేపర్ గ్లాసులు వినియోగించారు. అంతేకాదు వంటకాలు, నీరు వృధా కాకుండా ప్లాన్డ్‌గా చేశారు.
అల్పాహారం, భోజనం, స్నాక్స్ ఆరగించడానికి అరటి ఆకులు, పోకచెక్క బెరడుతో తయారుచేసిన ప్లేట్లను వాడారు.

ప్రత్యేకంగా తోడు వేయించిన పెరుగుతో లస్సీ చేయించారు. అలా ప్రతి విషయంలో ప్లాస్టిక్ అనే మాట వినకుండా అతిథులను ఆకట్టుకున్నారు. భోజనాలు చేసే టేబుల్స్‌పై సైతం ప్లాస్టిక్ కవర్స్ కనిపించలేదు. కాగితంతో తయారుచేసిన అందమైన డిజైన్లను వాడారు. ఇక భోజనానంతరం అందించే కిళ్లీని సైతం ప్లాస్టిక్ కవర్‌లో ఇవ్వకుండా.. టూత్‌పిక్‌తో గుచ్చి డైరెక్ట్‌గా అతిథుల చేతికి అందించే ఏర్పాట్లు చేశారు.

మెనూ విషయంలోనూ నో కాంప్రమైజ్.. అంతా లిమిట్..!

మెనూ విషయంలోనూ నో కాంప్రమైజ్.. అంతా లిమిట్..!

అదంతా ఒక ఎత్తైతే మెనూ విషయంలోనూ ఆ దంపతులు పెద్దఎత్తున కసరత్తు చేశారు. పదుల సంఖ్యలో ఆహార పదార్థాలు లేకుండా సింపుల్‌గా ప్లాన్ చేశారు. మధ్యాహ్న భోజనంలో పప్పు, రసంతో పాటు రెండు కూరలు, పచ్చళ్లు, పొడులు, రెండు రకాల స్వీట్లు మాత్రమే సిద్ధం చేయించారు. ఇక రాత్రి భోజనానికి పుల్కా, చపాతి, సాంబర్, రెండు కూరలు, అన్నం, పెరుగు, రెండు రకాల స్వీట్లు మాత్రమే అందించారు. మరో విశేషమేంటంటే ఎక్కడా కూడా ఐస్ వినియోగించలేదు. అంతేకాదు ఐస్‌క్రీమ్‌ను కూడా దూరంగా పెట్టారు.

తమ్ముడి కోసం అన్న పాకులాట.. గిట్లనే చెప్పాలే.. గ్రామస్తులకు ఎమ్మెల్యే కోనప్ప క్లాస్ (వీడియో)తమ్ముడి కోసం అన్న పాకులాట.. గిట్లనే చెప్పాలే.. గ్రామస్తులకు ఎమ్మెల్యే కోనప్ప క్లాస్ (వీడియో)

గుడివాడలోనూ ఇలాంటి పెళ్లి.. జనాల్లో చైతన్యం కోసమే..!

గుడివాడలోనూ ఇలాంటి పెళ్లి.. జనాల్లో చైతన్యం కోసమే..!

ఫిబ్రవరి చివరి వారంలో కృష్ణాజిల్లా గుడివాడలో కూడా సేమ్ ఇలాంటి వివాహ వేడుక జరిగింది. భవిష్యత్తు భద్రతాదళం అనే పేరుతో ప్లాస్టిక్ వాడకం వల్ల పొంచిఉన్న నష్టాలను వివరిస్తూ కరపత్రాలు, వాల్ పోస్టర్లతో జనాల్లో అవగాహన కల్పిస్తున్న వి.వి. మురళీకృష్ణ సైతం తమ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి దూరంగా ఉన్నారు.

తన కొడుకు పెళ్లి వేడుకను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించి జనాల్లో చైతన్యం నింపాలని భావించారు. ప్లాస్టిక్ ముచ్చట లేకుండా వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. స్వాగతదారాన్ని సైతం ఫ్లెక్సీలు, బ్యానర్లతో కాకుండా పసుపు వస్త్రంపై సహజ రంగులతో వధూవరుల పేర్లను రాయించడం విశేషం. అతిథులు కూర్చుండటానికి ప్లాస్టిక్ కుర్చీలు వేయించకుండా ఇనుప కుర్చీలను వాడటం మరో ప్రత్యేకత. చెరకు గడలు, అరటి గెలలు, మామిడాకులు, తాటాకులు ఇలా అన్నీ కూడా సహజసిద్ధమైనవి వాడి శభాష్ అనిపించుకున్నారు. ఇలా లక్షల్లో ఏ ఒక్కరో ఇద్దరో కాకుండా అత్యధిక సంఖ్యలో ఈవిధంగా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో కదూ.

English summary
Plastic Usage grows up day by day in human life. That is very dangerous to health, but no one cares. One Family held marriage in decent way as no plastic usage in Visakhapatnam. Guests very happy for this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X