విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాటంటే మాటే.. చెప్పింది చేస్తాం.. విశాఖలో వైఎస్‌ఆర్ పెన్షన్ పథకంలో మంత్రి బొత్స

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం : టీడీపీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ చురకలు అంటించారు. గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం మాయమాటలు చెప్పబోదని స్పష్టం చేశారు. ఏది చెబుతామో అది చేస్తామని వెల్లడించారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వబోమని.. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. మాట తప్పని, మడమ తిప్పని నేతగా అభివర్ణించారు.

విశాఖలో వైఎస్ఆర్ పెన్షన్ పథకాన్ని మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు బొత్స. పలువురు లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి బొత్స.. విశాఖ వాసులకు మరిన్ని సౌకర్యాలు అందించేలా కృషి చేస్తామన్నారు.

ఆ రెండూ దొందూ దొందే.. టీఆర్ఎస్, బీజేపీపై శ్రీధర్ బాబు గరంఆ రెండూ దొందూ దొందే.. టీఆర్ఎస్, బీజేపీపై శ్రీధర్ బాబు గరం

Recommended Video

వైయస్ ఆర్ సుపరిపాలనను జగన్ కొనసాగిస్తున్నారు
ycp government ready to serve needy people says minister botsa

సెంట్రల్ పార్క్ ఏరియాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు బొత్స. అలాగే విశాఖ సెంట్రల్ పార్క్‌గా చలామణీలో ఉన్నదాన్ని వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్‌గా మార్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడ వైఎస్ఆర్ వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2వ తేదీన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.

English summary
Andhrapradesh Minister Botsa Satyanarayana launched ysr pension scheme in visakhapatnam with another minister. He says that, our government serves the poor people. Last TDP Government did not fulfill the poor people needs, he says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X