విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మెప్పు కోసమే చంద్రబాబుపై విమర్శలా ? అరాచకాలకు అడ్డాగా విశాఖ : టీడీపీ నేతల ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని, వైసీపీ నేతలు జగన్ మెప్పు కోసమే చంద్రబాబును విమర్శిస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు . వైసీపీ నేతలు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని టిడిపి ఎంపి కొనకళ్ల రవీంద్ర కుమార్ విమర్శించారు. జగన్ మెప్పుకోసం చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కోర్టులపై , న్యాయమూర్తుల పైన ఆరోపణలు చేయడం, న్యాయమూర్తులు బెదిరించే స్థాయికి వెళ్లడం దారుణమని కనకమేడల అన్నారు .

ప్రత్యేక హోదాపై ఎన్నికల ముందు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఆ విషయాన్ని వదిలేశారని మండిపడ్డారు. ప్రస్తుతం వైసిపి ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. అలా కాకుండా చంద్రబాబుని విమర్శించిన పనిగా పెట్టుకున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.

ఏపీ రాష్ట్రంలో వైసిపి హయాంలో అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు దేవినేని ఉమా .టిడిపి హయాంలో విశాఖను పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దితే, ఇప్పుడు విశాఖను అడ్డ పంచల అడ్డాగా మార్చారని ఆయన విమర్శలు గుప్పించారు. భూకబ్జాలు ,దౌర్జన్యాలతో విశాఖ వాసులు బెంబేలెత్తిపోతున్నారు అని దేవినేని ఉమ అన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడి పోగొట్టి అరాచకం తీసుకువచ్చారని విమర్శించారు.

YCP leaders are criticizing Chandrababu for Jagans appreciation : tdp fire

విశాఖ వాసుల భయమే నిజమైంది అన్న చంద్రబాబు మాటలకు సమాధానం చెప్పాలని దేవినేని ఉమ సోషల్ మీడియా ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతే కాదు రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్నా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో దానిపై చర్చ జరపకపోవడం పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు .ఇక దీనిపై ''నిన్న 9782 కేసులు, 86 మరణాలు.

కొంతమంది ప్రజాప్రతినిధులు పక్క రాష్ట్రాల్లో కార్పొరేట్ వైద్యం పొందుతున్నారు. సామాన్య, మధ్య తరగతి వారికి కూడా ఆ స్థాయిలో వైద్యం అందించాలి. 3,16,000 కేసులు, 3000 మరణాలతో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా ఎందుకు కేబినెట్‌లో చర్చించి ప్రజలకు భరోసాకల్పించ లేదు సీఎం జగన్'' అంటూ దేవినేని సీఎం జగన్ ను ప్రశ్నించారు .

English summary
TDP leaders are incensed that anarchy continues in the AP and that YCP leaders are criticizing Chandrababu just for Jagan's appreciation. TDP MP Konakalla Ravindra Kumar and devineni uma outraged on ycp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X