విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువత నలుగురికి ఉపాధి కల్పించాలి, టీఐఈ సమ్మిట్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

|
Google Oneindia TeluguNews

యువత ఉద్యోగం కోసం చూడొద్దని.. నలుగురికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పుడు ఉపాధి కోసం చూడొద్దని చెప్పారు. యువతే తిండి పెట్టే స్థాయి ఉండాలని కోరారు. ఆయన విశాఖ పట్టణం పర్యటనలో ఉన్నారు. వర్చువల్ విధానంలో టీఐఈ గ్లోబల్ సమ్మిట్-2020లో ప్రసంగించారు. ఈ సందర్భంగా యువత.. ఉపాధి అవకాశాలు కల్పించాలని హిత బోధ చేశారు.

దేశ జనాభాలో 65 శాతం మంది యువత ఉన్నారని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. వారు శక్తి సామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
అభివృద్ధి సాధించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తర్వాతి తరాలకు మార్గదర్శనం చేయాల్సి ఉంటుందని సూచించారు. వారి అనుభవాలను, విజ్ఞానాన్ని భావి తరాలకు అందజేయాలని తెలిపారు. అలా వారు భావి తరాలకు ఆదర్శంగా నిలువాలని కోరారు. దీంతో రాబోయే తరం మరింత ముందు ఉంటుందని చెప్పారు.

you have employee four members: vice president venkaiah naidu

Recommended Video

Ysrcp, TDP Took U-Turn On Agri Bills | నాడు అలా.. నేడు ఇలా.. | Bharat Bandh

టీఐఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను నడిపించేందుకు 300 మందికి పైగా మార్గదర్శకులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. ఇది హర్షణీయ పరిణామం అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దీనిని బట్టి పరిస్థితి మారిపోయింది అని చెప్పడానికి సాక్ష్యంగా నిలిచిందని చెప్పారు. ప్రభుత్వ/ ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉన్నాయని.. నలుగురికి ఆఫర్ చేసే పరిస్థితి నెలకొందని చెప్పారు. దేశ అభివృద్ది యువత చేతిలో ఉంది అని వెల్లడించారు. జాతి నిర్మాణం కూడా యువత ద్వారే జరుగుతుందని గుర్తుచేశారు. నేటి బాలలే రేపటి పౌరులు అని.. యువతే దేశానికి వెన్నెముక అని వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

English summary
you have employee four members vice president venkaiah naidu said to youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X