విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపై ఫోకస్ పెట్టిన సాయిరెడ్డి: బైక్ ర్యాలీ.. సవారీ: వారం తిరక్కముందే: చాపకింద నీరులా

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉన్న సాగర నగరం విశాఖపట్నంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దృష్టి సారించారు. ఇదివరకెప్పుడూ లేనివిధంగా విశాఖవాసులను ఆలరించేలా కొత్త కొత్త ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించని ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నేతలు విశాఖపట్నంపై ఫోకస్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఈవెంట్లకు సారథ్యాన్ని వహిస్తున్నారు.

తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆ ఫిజియోథెరపిస్ట్? దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి ఎమ్మెల్సీ?తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆ ఫిజియోథెరపిస్ట్? దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి ఎమ్మెల్సీ?

వాకథాన్.. వారం తిరక్కముందే బైక్ ర్యాలీ..

వాకథాన్.. వారం తిరక్కముందే బైక్ ర్యాలీ..

ఈ నెల 14వ తేదీన విశాఖపట్నంలో వుయ్ సపోర్ట్ వైజాగ్ పేరుతో వాకథాన్‌ను నిర్వహించారు. వారం రోజులు తిరకముందే- బైక్ ర్యాలీని చేపట్టారు. స్పీడ్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్‌‌కు వ్యతిరేకంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ రెండింటి వల్ల సంభవించే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. జిల్లాకే చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అరకు లోక్‌సభ సభ్యురాలు గొడ్డేటి మాధవి, గ్రేటర్ విశాఖ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 ఆర్కే బీచ్ టు రుషికొండ

ఆర్కే బీచ్ టు రుషికొండ


ఈ ఉదయం విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఆరంభమైన బైక్ ర్యాలీని రుషికొండ వరకు కొనసాగించారు. ఈ ర్యాలీలో సాయిరెడ్డి బైక్‌పై సవారీ సాగించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. భవిష్యత్తులో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అవతరించబోతోందని సాయిరెడ్డి పునరుద్ఘాటించారు. కొన్ని ఇబ్బందులు ఎదురుకాపోయి ఉంటే ఈ పాటికే విశాఖ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించే ఉండేవారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల వలసలు, పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖను పరిపాలనా రాజధానిగా బదలాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని అన్నారు.

విశాఖను పరిపాలనా రాజధానిగా చూడబోతున్నాం..

విశాఖను పరిపాలనా రాజధానిగా చూడబోతున్నాం..

మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధిని సాధిస్తాయనేది తమ ప్రభుత్వ ఆశయమని చెప్పారు. దీనికి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. అయినప్పటికీ.. అన్ని అడ్డంకులను త్వరలోనే అధిగమిస్తామని హామీ ఇచ్చారాయన. విశాఖను పరిపాలనా రాజధానిగా చూడబోతున్నామని చెప్పారు. రాజధానిని స్వాగతించడానికి ప్రతి విశాఖ పౌరుడూ సిద్ధంగా ఉన్నాడని, వుయ్ సపోర్ట్ వైజాగ్ పేరుతో ఇటీవల నిర్వహించిన వాకథాన్ కార్యక్రమం విజయవంతం కావడమే దీనికి నిదర్శనమని సాయిరెడ్డి అన్నారు.

Recommended Video

Andhra Pradesh: అర్హులంద‌రికీ డిసెంబ‌ర్ 25న ఇళ్ల ప‌ట్టాల పంపిణీ... 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా...!!
వరల్డ్ క్లాస్ సిటీగా..

వరల్డ్ క్లాస్ సిటీగా..

అంతర్జాతీయ అవార్డుల్లో విశాఖపట్నం మూడో స్థానాన్ని దక్కించకుందనే విషయాన్ని మంత్రులు గుర్తు చేశారు. స్పెయిన్‌లో నిర్వహించిన స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌-2020లో విశాఖ స్మార్ట్‌ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడిందని అన్నారు. ‘లివింగ్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ అవార్డు' కేటగిరీలో మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ అండ్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రాజెక్టుల్లో విశాఖ మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. మున్ముందు- మరిన్ని ప్రపంచంలోనే అగ్ర నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రేటర్ విశాఖ అధికారుల కృషి వల్ల రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించిందని అవంతి శ్రీనివాస్ అన్నారు.

English summary
YSR Congress Party MP V Vijayasai Reddy orgaized bike rally in Visakhapatnam against Speed driving and Eve teasing on Friday. Ministers Avanthi Srinivas, Kurasala Kannababu, MPs Goddeti Madhavi, MVV Satyanarayana and Party MLAs were participated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X