• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెరపైకి నూతన్‌ కామెంట్స్‌-దూరం జరుగుతున్న వైసీపీ- బాధితుడికి సాయంతో సింపతీ మార్క్‌..

|

విశాఖపట్నం : ఇప్పటికే రాష్ట్రంలో దళితులపై దాడుల ఘటనలో తమకు సంబంధం ఉన్నా లేకున్నా టార్గెట్‌ అయిపోతున్న వైసీపీకి తాజాగా విశాఖపట్నంలో చోటు చేసుకున్న నూతన్‌ నాయుడు ఇంట్లో శిరోముండనం వ్యవహారం మరింత చికాకు తెప్పిస్తోంది. ఈ ఘటనపై అధికార పార్టీగా స్పందించి చర్యలు తీసుకునే లోపే నూతన్‌ గతంలో చేసిన కామెంట్స్‌ తెరపైకి రావడంతో వైసీపీతో ఆయనకున్న సంబంధాలను టార్గెట్‌ చేస్తూ విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో ఇరుకునపడిన వైసీపీ నేతలు ఇప్పుడు నూతన్‌కు దూరంగా జరిగేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

 నూతన్‌ కామెంట్స్‌తో చిక్కుల్లో వైసీపీ...

నూతన్‌ కామెంట్స్‌తో చిక్కుల్లో వైసీపీ...

విశాఖపట్నంలోని తన సొంత ఇంట్లో దళితుడికి శిరోముండనం చేయించిన ఘటనలో నూతన్‌ నాయుడు కుటుంబం ఇరుక్కని విలవిల్లాడుతోంది. ఈ ఘటనలో సీసీ ఫుటేజ్‌ సహా దొరికిపోవడంతో నూతన్‌ కుటుంబంలో పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. అంతకు మందే తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పోలీసుల సాయంతో ఓ దళిత యువకుడికి వైసీపీ నేతలు గుండు కొట్టించారన్న ఆరోపణలు దుమారం రేగుతుండగానే ఈ ఘటన కూడా చోటు చేసుకోవడంతో వైసీపీ సర్కారు ఇరుకునపడింది. అదే సమయంలో గతంలో వైసీపీ వ్యూహాల్లో పాలు పంచుకున్నానంటూ గతంలో యూట్యూబ్‌ ఇంటర్వ్యూల్లో నూతన్‌ చేసిన కామెంట్స్‌ తో ఆ పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. వీటిని టీడీపీ అనుకూల మీడియా హైలెట్‌ చేయడంతో ఈ కామెంట్స్‌ చూసిన వారు వైసీపీ మద్దతునే నూతన్ కుటుంబం ఇంతగా బరితెగించిందనే ఆరోపణలు చేస్తున్నారు.

నూతన్‌కు దూరంగా వైసీపీ...

నూతన్‌కు దూరంగా వైసీపీ...

అయితే ఈ ఘటన నేపథ్యంలో నూతన్‌ ను వైసీపీ, జనసేనతో లింకులు కలుపుతూ టీడీపీ సోషల్‌ మీడియాలో సాగుతున్న ప్రచారం తీవ్రమైంది. అయితే జనసేన నేరుగా ఈ ఘటనకు కానీ, నూతన్‌ నాయుడికి కానీ తమ పార్టీకి లింకులు లేవని నేరుగా ప్రకటన జారీ చేసింది. వైసీపీ నేతలు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి నూతన్‌తో తమకెలాంటి సంబంధం లేదని చెప్పుకుంటున్నా గతంలో ఆయన చేసిన కామెంట్స్‌ మాత్రం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా ప్రెస్‌మీట్లు పెడుతూ నూతన్‌కు తమకూ సంబంధం లేదని పదేపదే చెబుతున్నారు. అయినా ఇప్పటికే టీడీపీ నూతన్ కామెంట్స్‌ను వైరల్‌ చేయడంతో వైసీపీ ఇరుకునపడక తప్పడం లేదు.

  AP Schools Reopening సాధ్యమేనా ? వ్యాక్సిన్‌ వచ్చే వరకూ స్కూళ్లను మూసెయ్యాలి!
  బాధితునికి సాయం, ఉద్యోగం...

  బాధితునికి సాయం, ఉద్యోగం...

  నూతన్‌ నాయుడు ఇంట్లో జరిగిన ఘటనలో టీడీపీ నుంచి ఎదురవుతున్న విమర్శలను దారి మళ్లించేందుకు వైసీపీ నేతలు నేరుగా బాధితుడిని సంప్రదించి సాయం ఆఫర్‌ చేస్తున్నారు. స్ధానిక పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌తో పాటు మరికొందరు వైసీపీ నేతలు 50 వేల మేరకు సాయంతో పాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కూడా ఇప్పిస్తామని బాథితుడికి భరోసా ఇచ్చారు. తద్వారా బాధితుడికి అండగా నిలిచామన్న సంకేతాలు పంపాలని వైసీపీ భావిస్తోంది. ఓవైపు నూతన్‌తో కానీ, ఆయన కామెంట్స్‌తో కానీ తమ పార్టీకి కానీ, తమకు కానీ ఎలాంటి సంబంధం లేదనే అంశాన్ని జనంలోకి పంపాలని వైసీపీ కోరుకుంటోంది. అయితే ఈ వ్యవహారాన్ని టీడీపీ హైలెట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో నూతన్‌ కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోక తప్పని పరిస్ధితి మాత్రం కనిపిస్తోంది.

  English summary
  tollywood cine producer and actor nutan naidu's comments after dalit man tonsure incident in his home at visakhapatnam, ysrcp seems to be suffered heavily. now ysrcp leaders offers help to the victim and stay away with this incident also.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X