విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దగ్గరి బంధువులను పెళ్లి చేసుకోకూడదని నన్నపునేని రాజకుమారి షాకింగ్ కామెంట్

|
Google Oneindia TeluguNews

మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి షాకింగ్ కామెంట్ చేశారు. దగ్గరి బంధువులను పెళ్లి చేసుకోకూడదని, మేనరికపు పెళ్లిళ్లతో ఇబ్బందులు తలెత్తుతాయని ఆమె సంచలన వ్యాఖ్య చేశారు.
విశాఖపట్నం లోని ప్రహ్లాదపురం నూకాలమ్మ గుడి వద్ద ఇటీవల అంగవైకల్యంతో పుట్టిన ఇద్దరు చిన్నారులను విషమిచ్చి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన మహిళ కుటుంబాన్ని పరామర్శించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి. ఇక ఈ నేపధ్యంలోనే ఆమె ఈ వ్యాఖ్య చేశారు .

పంచాయితీనే కానీ పార్లమెంట్ కన్నా మంచి నిర్ణయం .. మహిళలను వేధిస్తే ....పంచాయితీనే కానీ పార్లమెంట్ కన్నా మంచి నిర్ణయం .. మహిళలను వేధిస్తే ....

మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడిన నన్నపునేని రాజకుమారి మేనరికపు పెళ్ళి ఆ మహిళ మరణానికి కారణమని తెలుసుకున్నారు. మేనరికపు పెళ్లి చేసుకోవడం వల్లే ఆమెకు ఇద్దరు అంగవైకల్యంతో ఉన్న చిన్నారులు పుట్టారని, వారిని అలా చూస్తూ బాధ భరించలేక వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యుల ద్వారా నన్నపనేని రాజకుమారి తెలుసుకున్నారు.

The shocking comment of Nannapuneni Rajakumari not to marry close relatives

ఇక ఈ విషయంలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశంలో మేనరికపు పెళ్లిల్లు సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి.మేనరికపు పెళ్లిళ్ల పై అభ్యంతరాలు ఉన్నప్పటికీ, అలా పెళ్లి చేసుకోవడం వల్ల జన్యు సంబంధమైన లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నప్పటికీ మేనరికపు పెళ్లిల్లు జరుగుతూనే ఉన్నాయి. మేనరికపు పెళ్లి వల్లనే తనకు పుట్టిన ఇద్దరు చిన్నారులు మూగ, చెవిటి వారి గా పుట్టారని తీవ్ర మనస్థాపానికి గురైన తల్లి చిన్నారులను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న నన్నపనేని రాజకుమారి మేనరికపు వివాహాలు ,దగ్గరి బంధువులతో జరిపించే వివాహాలు, బాల్య వివాహాలు చాలా సమస్యలకు కారణం అవుతాయని కాబట్టి అలాంటి పెళ్లిళ్లు చేసుకోకూడదని చాలా సీరియస్ గా స్పందించారు.

English summary
Woman's Commission Chairperson Personnel She made a sensational remark that would not marry close relatives and that trouble would arise with nieces and nephews.Chairperson of Woman's Commission Chairperson Nannapaneni says that the family of a woman who committed suicide by poisoning two disabled children recently at Prahaladapuram Nukkalamma temple in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X