విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదు .... వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు . విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణాలపై పూర్తి విచారణ జరిపిస్తామని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు . భూ కుంభకోణం వ్యవహారంలో సంబంధం ఉన్న అధికారులు గానీ ప్రజాప్రతినిధులను గానీ విడిచి పెట్టమని హెచ్చరించారు. భూకుంభకోణంలో ఎంతటి వారు ఉన్నా వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు .

భూ కుంభకోణంలో ఉన్న ఎవర్నీ వదిలేది లేదు... రాజధాని భూములపైన కూడా విచారణ జరిపి తీరుతాం అన్న వైసీపీ ఎమ్మెల్యే

భూ కుంభకోణంలో ఉన్న ఎవర్నీ వదిలేది లేదు... రాజధాని భూములపైన కూడా విచారణ జరిపి తీరుతాం అన్న వైసీపీ ఎమ్మెల్యే

మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ . కానీ అక్కడ జరిగిన అవకతవకలకు మాత్రమే తాము వ్యతిరేకమని తెలిపారు. అమరావతి రాజధాని పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణాలపై పూర్తి విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.ఇక ఇటీవల టీడీపీ నేతను హెచ్చరించి వార్తల్లో నిలిచారు అమర్‌నాథ్. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రౌడీల ప్రవర్తించారని ఆరోపించిన అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ప్యాకేజీ లీడర్లకు గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పారు.

ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ .. జీవీఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీని చిత్తుగా ఓడిస్తామన్న ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్

ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ .. జీవీఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీని చిత్తుగా ఓడిస్తామన్న ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్

టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుమతి లేకుండా ర్యాలీ చేయడమే కాకుండా అసభ్యకరంగా ఆయన మాట్లాడిన తీరు దారుణమని మండిపడ్డారు. వెలగపూడికి దమ్ముంటే జీవీఎంసీ ఎన్నికల్లో తన చేతలు చూపించాలని సవాల్ విసిరారు అమర్‌నాథ్.జీవీఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీని చిత్తుగా ఓడిస్తామని అన్నారు.అనకాపల్లి నియోజకవర్గ ప్రజలను టీడీపీ మోసం చేసిందని తెలిపారు. ఏపీ సీఎం వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో నవరత్నాలకే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. విద్య వైద్య అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి.

ప్రక్షాళన దిశగా వైసీపీ అడుగులు .. జగన్ సైతం కీలక నిర్ణయాలు

ప్రక్షాళన దిశగా వైసీపీ అడుగులు .. జగన్ సైతం కీలక నిర్ణయాలు


మరోవైపు జగన్ కూడా ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తరువాత ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తునారు .అందులో భాగంగా జ‌గన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీలో నెల‌కొన్న ఆర్దిక ప‌రిస్థితులు, రాజ‌ధానిలో అవినీతి జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల కార‌ణంగా రాజ‌ధానిలోని కొన్ని ప‌నుల‌కు తాత్కాలిక బ్రేక్ వేయాల‌ని నిర్ణ‌యించారు. దీని పైన పూర్తి స్థాయిలో ఈనెల 6న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్షించ‌నున్నారు. సమీక్ష త‌రువాత ప‌నుల‌ను కొన‌సాగించాలా ..వ‌ద్దా అనే దాని పైన తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.

English summary
Anakapalli MLA Gudivada Amarnath made clear nobody can leave who was involved in corruption, irregularities in government. Gudivada Amarnath, MLA, said a full inquiry will be conducted on land scams in Visakhapatnam. he warned the authorities or public figures involved in the land scams. He said that no matter how much they are in the land scams, there is no question of leaving them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X