• search
 • Live TV
విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డియర్ పవన్ కల్యాణ్..యు ఆర్ జెంటిల్‌మెన్: మీ నుంచి కోరుకునేది అదొక్కటే: టీడీపీ ఉచ్చు: సంచైత

|

విజయనగరం: ప్రఖ్యాత మన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సంచైత గజపతి రాజు ప్రత్యర్థులపైతన ఎదురుదాడిని కొనసాగిస్తున్నారు. తన మీద చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై కౌంటర్ అటాక్ ఇచ్చిన ఆమె.. ఈ సారి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. హితబోధ చేశారు.

సింహాచలం దేవస్థానంలో ఫోరెన్సిక్ ఆడిట్: టీడీపీకి ఎందుకు వణుకు: సంచైత

 పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై..

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై..

ప్రస్తుతం మన్సాస్ ట్రస్ట్ హిందూయేతరుల సారథ్యంలో కొనసాగుతోందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సంచైత తోసిపుచ్చారు. అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. తాను నిఖార్సయిన హిందువునని అన్నారు. తన తల్లిదండ్రులు ఆనంద గజపతి రాజు, ఉమా గజపతి రాజు హిందువులని గుర్తు చేశారు. ఉమా గజపతి రాజు సద్బ్రాహ్మణ పురోహితుల కుటుంబానికి చెందిన రమేష్ శర్మను ద్వితీయ వివాహం చేసుకున్నారని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆమె వరుస ట్వీట్లను సంధించారు.

టీడీపీ ఉచ్చులో పడొద్దు..

టీడీపీ ఉచ్చులో పడొద్దు..

రమేష్ శర్మ ఓ ఫిల్మ్ మేకర్‌గా ఆరుసార్లు జాతీయ, అంతర్జాతీయ అవార్డును అందుకున్నారని సంచైత గజపతి రాజు అన్నారు. ప్రతిష్ఠాత్మక ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యారని చెప్పారు. తనపై, తన కుటుంబంపై తెలుగుదేశం పార్టీ ఆరోపణలను చేయడాన్ని పనిగా పెట్టుకుందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతల ఉచ్చులో పడొద్దని సంచైత.. పవన్ కల్యాణ్‌కు సూచించారు. పవన్ కల్యాణ్ చుట్టూ టీడీపీ నాయకులు ఫేక్‌న్యూస్‌ల వల పన్నారని చెప్పారు. టీడీపీ నేతల మాయ నుంచి బయటపడాలని అన్నారు.

ఫోరెన్సిక్ ఆడిట్‌తో టీడీపీ నేతల బండారం..

ఫోరెన్సిక్ ఆడిట్‌తో టీడీపీ నేతల బండారం..

తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తుతం తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారని సంచైత చెప్పారు. సింహాచలం దేవస్థానం, మన్సాస్ ట్రస్టులో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోందని, దీనివల్ల తాము చేసిన అవినీతి, అవకతవకలు బయటపడతాయనే భయం టీడీపీ నేతలను పట్టుకుందని అన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల తమ గుట్టురట్టువుందని వారు బెదిరిపోతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వారు ఎలాంటి ఆరోపణలైనా చేయగలరని పేర్కొన్నారు. వారి బండారం బయటపడే రోజులు దగ్గరగా ఉన్నాయని సంచైత చెప్పారు.

  కాశీ, అయోధ్య వంటి హిందూ యాత్రలకు డబ్బులు ఇవ్వారా ? | Janasena | BJP | Pawan Kalyan | Oneindia Telugu
  ఓ జెంటిల్‌మెన్‌గా..

  ఓ జెంటిల్‌మెన్‌గా..

  ఒక నిఖార్సయిన హిందువుగా తాను అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తానని సంచైత అన్నారు. `మీరు ఆ పని చేయగలరా?` అని ఆమె పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను తాను ఓ జెంటిల్‌మెన్‌గా భావిస్తున్నానని, మన్సాస్ ట్రస్ట్‌కు హిందూయేతరులు సారథ్యాన్ని వహిస్తున్నారనే వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పారు. ఈ దిశగా ఓ ప్రకటన విడుదల చేయాలని ఆమె పవన్ కల్యాణ్‌కు విజ్ఙప్తి చేశారు. `ఓ జెంటిల్‌మెన్‌గా మీ నుంచి నేను ఆశిస్తున్నది అదొక్కటే..`అని సంచైత పేర్కొన్నారు. దీనిపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

  English summary
  Mansas Chairperson Sanchaita Gajapati Raju given counter attack to Jana Sena Party Chief Pawan Kalyan. She told that Pawan Kalyan should not fall prey to fake news being spread by the Telugu Desam Party.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X