పోలీస్ అని చెప్పి.. గిరిజిన బాలికలపై లైంగికదాడి... ఎక్కడ అంటే
ఎవరినీ వదలడం లేదు. మైనర్లు, దళిత, గిరిజన బాలికలను కూడా లైంగికంగా వేధిస్తున్నారు. విజయనగరం జిల్లా కురుపాంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇద్దరు గిరిజన బాలికలపై కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాంబాబు అనే వ్యక్తి పోలీసు అని బెదిరించాడు. ఇద్దరిపై అత్యాచారం చేశాడు. ఒట్టిగెడ్డ రిజర్వాయర్ విహారయాత్ర ముగించుకుని తిరిగి వెళ్తుండగా బాలికలను బెదిరించి రాంబాబు లొంగదీసుకున్నాడు. వారిపై అత్యాచారం చేశాడు. రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థినులు, మరో ఇద్దరు విద్యార్థులు మొత్తం నలుగురు ఒట్టిగెడ్డ రిజర్వాయర్‌కు విహార యాత్రకు వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో నడుచుకుంటూ వస్తుండగా రాంబాబు వారిని అటకాయించాడు. తోటలోకి తీసుకెళ్లి బెదిరించాడు. ఇద్దరు విద్యార్ధులను అక్కడే కూర్చొబెట్టారు. మిగిలిన ఇద్దరు విద్యార్థినులను సమీపంలోని ఫామ్ ఆయిల్ తోటలోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

రాత్రి జూనియర్ కాలేజీకి చేరుకున్న విద్యార్థులు జరిగిన ఘటనను కాలేజీ సిబ్బందికి వివరించారు. కాలేజీ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగం ప్రవేశం చేసిన పోలీసులు పూర్తి వివరాలను సేకరించిన తర్వాత నిందితుడు రాంబాబును అదే రాత్రే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాంబాబు గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అతనిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పోలీస్ అని చెప్పి లైంగికంగా వేధించాడు. ఇద్దరీపై లైంగిక దాడి చేశాడు. వారు గిరిజన విధ్యార్థులు కాగా.. ఏం చేసుకుంటారో అని బరితెగించాడు. చివరికీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమాజంలో వెనకబడిన తమ జాతి పిల్లలపై అఘాయిత్యాలు చేయడం ఏంటీ అని కోరుతున్నారు. మరొకరు ఇలా చేయడానికి భయపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే వారు తమను లైట్ తీసుకుంటారని వారు వాపోతున్నారు.