విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమె పెళ్ళికి, రాజకీయానికి ఆసక్తికరమైన లింక్ ఉందన్న మంత్రి పుష్ప శ్రీవాణి

|
Google Oneindia TeluguNews

ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పుష్ప శ్రీ వాణి జగన్ క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా ,గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులలో చిన్న వయస్కురాలైన ఆమె తనకు పెళ్లికి రాజకీయానికి ఉన్న లింక్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఒక చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె జగన్ తనకు సాక్షాత్తు దేవుడని తన అభిమానాన్ని చాటుకున్నారు.

 తన భర్త వైసీపీ నాయకుడు అయినందుకే పెళ్లి చేసుకున్నానన్న పుష్ప శ్రీవాణి

తన భర్త వైసీపీ నాయకుడు అయినందుకే పెళ్లి చేసుకున్నానన్న పుష్ప శ్రీవాణి

ఇక ఆమె తనకు పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తున్న వేళ, కాబోయే భర్త ఎలా ఉండాలి ఏం చేస్తుండాలి అన్న దాని కంటే కాబోయే భర్త రాజకీయాలో ఉండాలి, ఆయన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడై ఉండాలని కోరుకున్నానని ఆమె పేర్కొన్నారు. ఇకతన భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాబట్టే పెళ్లికి అంగీకరించానని, ఇదే విషయాన్ని పెళ్లికి ముందే ఆయనతో చెప్పానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి వ్యాఖ్యానించారు. నరనరాల్లో వైసీపీపై అభిమానం ఉండేదని , జగన్ మోహన్ రెడ్డి అంటే తమకు అభిమానాన్ని మించి ఆరాధన ఉండేదని ఆమె ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

'స్పందన' వేదికగా... వీఆర్వోతో, మహిళా రైతు ఇచ్చిన లంచం డబ్బులు తిరిగి ఇప్పించిన ఎమ్మెల్యే నంబూరి'స్పందన' వేదికగా... వీఆర్వోతో, మహిళా రైతు ఇచ్చిన లంచం డబ్బులు తిరిగి ఇప్పించిన ఎమ్మెల్యే నంబూరి

వైసీపీ నేత కాకుంటే చేసుకునే దాన్ని కాదు ... జగన్ పై ఉన్న ఆరాధన భావమే అందుకు కారణం అన్న మంత్రి

వైసీపీ నేత కాకుంటే చేసుకునే దాన్ని కాదు ... జగన్ పై ఉన్న ఆరాధన భావమే అందుకు కారణం అన్న మంత్రి

అంతే కాదు తనకు భర్తగా అనుకుంటున్న వ్యక్తి వైసీపీ నేత కాకుంటే, పెళ్లికి అంగీకరించి వుండేదాన్ని కాదని తేల్చి చెప్పారు . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తనకు దేవుడివంటి వాడని చెప్పుకొచ్చిన ఆమె జగన్ పార్టీలో ఉన్న నేత అయితే తాను సైతం పార్టీ కోసం కీలకంగా పని చెయ్యటానికి అవకాశం ఉంటుందని అందుకే ఆ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. మొదటి నుండ తనకు రాజకీయాలంటే ఇష్టమని, ఎవరి ప్రోద్బలంతోనో రాజకీయాల్లో లేనని చెప్పారు. కాగా, గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆమెను డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి జగన్ విధేయతకు పట్టం కట్టారు.

మంత్రి పుష్ప శ్రీవాణి చెప్పిన పెళ్ళికి, రాజకీయానికి మధ్య ఆసక్తికరమైన లింక్

మంత్రి పుష్ప శ్రీవాణి చెప్పిన పెళ్ళికి, రాజకీయానికి మధ్య ఆసక్తికరమైన లింక్

పుష్ప శ్రీవాణి చెప్పిన పెళ్ళికి, రాజకీయానికి మధ్య ఉన్న లింక్ విన్న వాళ్ళు అవాక్కయ్యారు. ఎవరైనా చక్కగా చదువుకుని, చూడటానికి అందంగా ఉంది, ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు కావాలని కోరుకుంటారు కానీ ఇలా రాజకీయ నాయకుడై ఉండాలని , అది కూడా వైసీపీ నేత అయితేనే పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఆయన వైసీపీ నేత కాకుంటే పెళ్ళికి నిరాకరించేదాన్ని అని చెప్పిన మంత్రి పుష్ప శ్రీ వాణి కమిట్మెంట్ వైసీపీ నేతలకు ఆహా అనిపించినా, వినేవాళ్లకు మాత్రం కాస్త విచిత్రంగా , ఇంకాస్త విడ్డూరంగానే ఉంది.

English summary
AP Minister Pushpa Srivani said that while she was looking to get married, she wanted to be a politician rather than what her fianc should look like. AP Deputy Chief Minister and Tribal Welfare Minister Pamula Pushpa Srivani said that her husband YSR Congress party leader , so she had agreed to the marriage and had told him about the same before the wedding.She has made an interesting comment about the YCP and that Jagan Mohan Reddy is a god of her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X