విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామతీర్థం ఉదంతంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం: అదుపులో ఇద్దరు అనమానితులు?

|
Google Oneindia TeluguNews

విజయనగరం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారి విగ్రహం విధ్వంసం ఘటనలో సీఐడీ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజకీయ దుమారానికి దారి తీసిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీఐడీ విచారణను చేపట్టిన రెండు రోజుల్లోనే అధికారులు పురోగతి సాధించారు. శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Recommended Video

Andhra Pradesh : Pawan Kalyan Slams AP CM YS Jagan Government On Temples Issue | Oneindia Telugu

సాక్ష్యాధారాలను సేకరించిన తరువాత.. ఈ విషయాన్ని వెల్లడిస్తారని సమాచారం. రామతీర్థం క్షేత్రంలో శ్రీరామచంద్రుడి విగ్రహం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తలను వేరు చేయడం, దాన్ని దేవస్థానం కోనేటిలో పడేసిన విషయం తెలిసిందే. రాములవారి విగ్రహం తల భాగాన్ని కోనేటి నుంచి వెలికి తీశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ దుమారానికి దారి తీసింది. రాజకీయాలకు హాట్‌స్పాట్‌గా మారింది.

Ramatheertham row: AP CID nab two persons allegedly involvement in Lord Sri Ramas idol vandalised

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతలు వరుస బెట్టి రామతీర్థం క్షేత్రాన్ని సందర్శించారు. భారతీయ జనతా పార్టీ, జనసేన నేతల సందర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై జగన్ సర్కార్ సీఐడీ విచారణకు ఆదేశించగా.. అధికారులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించే దిశగా పురోగతిని సాధించారు. విగ్రహం నుంచి తల భాగాన్ని వేరు చేయడానికి రంపాన్ని వినియోగించినట్లు ఇదివరకే నిర్ధారించారు. ఆ దుర్మార్గానికి పాల్పడిన నిందితుల కోసం వేట సాగించారు.

ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి పేర్లు, ఇతర వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని కూడా రంపంతోనే కోసినట్లు తేలిన విషయం తెలిసింది. ఈ రెండు ఉదంతాల్లో నిందితులు ఒకేరకంగా విధ్వంసానికి పాల్పడటం వల్ల ఈ రెండు ఘటనలకు వారే కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు.

English summary
AP CID nab two persons allegedly involvement in Lord Sri Rama's idol vandalised at Ramatheertham temple in Vizianagaram, which was leades political fume in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X