విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామతీర్ధం రాములవారి విగ్రహ ధ్వంసం ఘటన .. సీరియస్ అయిన మంత్రి వెల్లంపల్లి , అధికారులకు ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో కోదండరామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండరామ స్వామి వారి దేవాలయంలో ఆలయ తాళాలు పగులగొట్టి శ్రీరాముడి విగ్రహ శిరస్సును ధ్వంసం చేశారు గుర్తు తెలియని అగంతకులు. ఉదయం స్వామివారి కైంకర్యాలకు చేసేందుకు ఆలయ పూజారి వచ్చేసరికి విగ్రహం ధ్వంసం అయ్యి కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.

సినిమాల్లో వకీల్ సాబ్,బయట పకీర్ సాబ్..పవన్ రాజకీయాలకు పనికిరాడన్న మంత్రి వెల్లంపల్లి సినిమాల్లో వకీల్ సాబ్,బయట పకీర్ సాబ్..పవన్ రాజకీయాలకు పనికిరాడన్న మంత్రి వెల్లంపల్లి

విచారణ వేగవంతం చెయ్యాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశం

విచారణ వేగవంతం చెయ్యాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశం

అయితే కావాలనే ఎవరో ఈ దారుణానికి పాల్పడ్డారని జిల్లా ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులకు కఠినంగా శిక్షపడేలా చేస్తామని ఆమె పేర్కొన్నారు. రామతీర్థం లో జరిగిన రాములవారి విగ్రహ విధ్వంసం ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీ రాజకుమారి తో మాట్లాడి విచారణ వేగవంతం చేయాలని ,దోషులను కఠినంగా శిక్షపడేలా చేయాలని మంత్రి ఆదేశించారు.

విచారణ కోసం రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి నియామకం

విచారణ కోసం రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి నియామకం

అంతేకాదు విచారణ కోసం రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలని దేవాదాయ ప్రత్యేక కమిషనర్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు . ప్రస్తుతం రామతీర్థం రాములవారి విగ్రహం ధ్వంస ఘటనపై విచారణకు విచారణ అధికారిగా డి . భ్రమరాంబను నియమించారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఆలయాన్ని సందర్శించారు. స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమని అంటున్నారు .

వైసీపీ సంక్షేమ పాలన ఓర్వలేక రాజకీయ అరాచక శక్తుల పనే అంటున్న వైసీపీ నేతలు

వైసీపీ సంక్షేమ పాలన ఓర్వలేక రాజకీయ అరాచక శక్తుల పనే అంటున్న వైసీపీ నేతలు


భక్తుల మనోభావాలను దెబ్బ తినేలా చేయడం కోసం, సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కావాలనే ఎవరో ఈ దారుణానికి పాల్పడ్డారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా స్వామి వారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా యధావిధిగా ప్రతిష్ఠింప చేయడం కోసం తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఓర్వలేని రాజకీయ అరాచక శక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించటం కోసం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని వారు చెబుతున్నారు.

English summary
The statue was vandalized by some thugs at the kodandarama Temple in ramatirtham. SP rajakumari said that someone had committed this atrocity on purpose. Endowment Minister Vellampalli Srinivas has become serious over the destruction of the Rama idol in Ramatirtha. minister spoke to the district SP and directed to expedite the investigation and punish the culprits severely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X