విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రంగంలో జనసేన: రామతీర్థంలో ఉద్రిక్తత: రోడ్లన్నీ క్లోజ్..అడ్డుగా బ్యారికేడ్లు: బందోబస్తు

|
Google Oneindia TeluguNews

విజయనగరం: రాష్ట్ర రాజకీయాలకు హాట్‌స్పాట్‌గా మారిన విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం.. మళ్లీ ఉద్రిక్తంగా మారింది. జనసేన-భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన రామతీర్థం ధర్మయాత్ర ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రామతీర్థం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసింది. రామతీర్థానికి దారి తీసే మార్గాలన్నింటినీ మూసివేసింది. రోడ్లకు అడ్డుగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది. ఈ తెల్లవారుజాము నుంచి రామతీర్థం కొండపైకి వెళ్లడానికి ఎవరినీ అనుమతించట్లేదు.

Recommended Video

Ap cm ys jagan mohan reddy comments on Hindu Gods issue in Ap state

రామతీర్థం ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడి విగ్రహం నుంచి తలను వేరు చేశారు. దాన్ని కొలనులో పడేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత.. రాజకీయ వేడి హైపిచ్‌కు చేరుకుంది. తొలుత భారతీయ జనతా పార్టీ.. అనంతరం తెలుగుదేశం నేతలు ఈ ఆలయాన్ని సందర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు సైతం రామతీర్థం ఆలయాన్ని సందర్శంచారు. దానికి కొనసాగింపుగా జనసేన నేతలు ఈ ధర్మయాత్రను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేశారు.

Tension prevails at Ramatheertham after Jana Sena announced Dharma Yatra

కొద్దిరోజులుగా రామతీర్ధంలో నిరసనలు వ్య క్తం చేస్తున్న బీజేపీతో కలిసి జనసేన ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఉదయం 11 గంటలకు ఈ ధర్మయాత్ర రామతీర్థానికి చేరుకోవాల్సి ఉంది. దీనితో రామతీర్థంలో మరోసారి ఉత్కంఠ పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ యాత్రను భగ్నం చేయడంలో భాగంగా బీజేపీ, జనసేన నేతలను పోలీసులు గృహనిర్బంధంలోకి తీసుకుంటున్నారు. హౌస్‌ అరెస్ట్ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.

ఈ యాత్రకు బీజేపీ, జనసేన అనుబంధ సంఘాలతో పాటు కొన్ని ధార్మిక సంస్థలు మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటోన్న విగ్రహాల విధ్వంసాన్ని అడ్డుకోవడం, నిందితులపై కఠిన చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందంటూ జనసేన-బీజేపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని తీసుకొచ్చేలా ఈ ధర్మయాత్రను నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల మధ్య రామతీర్థంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

English summary
Tension prevails at Ramatheertham in Vizianagaram district of Andhra Pradesh, after Jana Sena Party and BJP jointly organised Ramatheertha Dharma Yatra announcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X