విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ తర్వాత.. మహారాజా ఆస్పత్రి పేరు మార్పు: రాత్రికి రాత్రే..

|
Google Oneindia TeluguNews

విజయనగరం: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రేపిన రాజకీయ దుమారం చల్లారకముందే.. మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి ప్రభుత్వం.. తాజాగా విజయనగరంలో ఎంతో ఘన చరిత్ర ఉన్న మహారాజా ఆస్పత్రి పేరును కూడా ఒక్కరోజులో మార్చేసింది.

మహారాజా ఆస్పత్రి పేరు మార్పు

మహారాజా ఆస్పత్రి పేరు మార్పు

మహారాజా జిల్లా కేంద్రం ఆస్పత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా పేరు మార్చారు. అయితే, తాజాగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు స్థానికులు పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

తెల్లారే సరికి ఆస్పత్రి బోర్డు మారింది..!

తెల్లారే సరికి ఆస్పత్రి బోర్డు మారింది..!


గురువారం రాత్రి మహారాజా కేంద్ర ఆస్పత్రి పేరుకు బదులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా బోర్డు దర్శనమివ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లిన రోగులు, స్థానికులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి రాత్రే ఆస్పత్రి పేరు మార్చడం సరికాదంటున్నారు.

మహారాజా రాజ వంశానికి అవమానమంటూ నిరసనలు

మహారాజా రాజ వంశానికి అవమానమంటూ నిరసనలు

ఆస్పత్రికి మహారాజా ఆస్పత్రి పేరునే కొనసాగించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన మహారాజా రాజవంశాన్ని అవమానించేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. కాగా, ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. టీడీపీతోపాటు ఇతర పార్టీలు, నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే, వైసీపీ సర్కారు మాత్రం తమ నిర్ణయం సరైనదేనని సమర్థించుకుంది. ఈ వివాదం సద్దుమణుతున్న సమయంలో తాజాగా, మహారాజా ఆస్పత్రి పేరు మార్పు చర్చకు దారితీసింది.

English summary
Vizianagaram Maharaja hospital name change: TDP protests
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X