వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ నడుము పట్టుకున్న డాక్టర్ .. రచ్చ రచ్చ చేసిన బంధువులు.. షాకింగ్ నిజం బయటపెట్టిన సీసీ కెమెరా

|
Google Oneindia TeluguNews

వరంగల్ లో ఆస్పత్రికి నడుం నొప్పి అని వెళ్ళిన ఓ మహిళా డాక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ రచ్చ రచ్చ చేసింది. తమ బంధువుల పేరుతో కొందరిని తీసుకొచ్చి ఆస్పత్రి పై దాడి చేయించింది. మీడియా ను పిలిపించి నానా హంగామా చేసింది. ఆపై లైంగికంగా వేధించటం మాత్రమే కాదు కులం పేరుతో తిట్టారని ఆ డాక్టర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది. అయితే ఈ కేసులో సీసీ కెమెరా ఫుటేజ్ ఆ మహిళ చేసిన పనిని కళ్ళకు కట్టినట్టు చూపింది. దీని వెనుక పెద్ద కుట్ర ఉండనే విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

సీఎం కేసీఆర్ కు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వినతి .. కేసీఆర్ స్పందిస్తారా ?సీఎం కేసీఆర్ కు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వినతి .. కేసీఆర్ స్పందిస్తారా ?

సుపారీ రీ తీసుకుని డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించారని ఓరుగల్లులో హంగామా చేసిన మహిళ

సుపారీ రీ తీసుకుని డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించారని ఓరుగల్లులో హంగామా చేసిన మహిళ

సుపారీ రీ తీసుకుని ఓ డాక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆ హాస్పటల్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించింది ఓ కిలాడీ లేడీ . చికిత్స కోసం వచ్చిన తన పట్ల డాక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడని 15 రోజుల క్రితం సంధ్య అనే మహిళ సృష్టించిన వివాదం వరంగల్ లో కలకలం రేపింది . వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్‌ ప్రతిష్టకు భంగం కలిగించాలనే లక్ష్యంతో పధకం పన్నినట్టు తేలింది. వరంగల్‌ బ్యాంకు కాలనీకి చెందిన కె.నాగేశ్వర్‌రావు, అతని మిత్రుడికి బాలాజీ ఆస్పత్రి డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ తో వ్యక్తిగత కక్షలు ఉన్న నేపధ్యంలోనే ఆయన ఈ ప్లాన్ వేసి సుదీర్ కుమార్ పరువు తియ్యాలని అనుకున్నాడు.

కేసులో ఇరికించటానికి లక్షా యాభై వేలకు డీల్ .. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైతే మరో రూ.5లక్షలు

కేసులో ఇరికించటానికి లక్షా యాభై వేలకు డీల్ .. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైతే మరో రూ.5లక్షలు

ఈ క్రమంలో ఆస్పత్రి ప్రతిష్టతో పాటు, డాక్టర్‌ పరువును దెబ్బతీసేందుకు, అతన్నితప్పు డు కేసులో ఇరికించడానికి ప్లాన్‌ వేసిన నాగేశ్వర్ రావు లక్షా 50 వేలకు డీల్‌ కుదుర్చుకున్నాడు. డాక్టర్‌ సుధీర్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైతే మరో రూ.5లక్షలు ఇస్తామని రాంబాబుతో నాగేశ్వర్‌రావు ఒప్పందం చేసుకున్నాడు. ఇక ఆ డీల్ లో భాగంగా 10 మంది పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. ప్లాన్‌ అమలులో భాగంగా ఈ నెల 12న హైదరాబాద్‌కు చెందిన రేవోజు సంధ్య అనే మహిళ వరంగల్‌ ఎస్వీఎన్‌ రోడ్డులోని బాలాజీ ఆస్పత్రికి వచ్చింది. డాక్టర్‌ కె.సుధీర్‌కుమార్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుంది. డాక్టర్‌ చాంబర్‌లోకి వెళ్లిన తర్వాత తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని తెలిపింది. దీంతో డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ ఆమెను పరీక్షించడానికి ప్రయ త్నిస్తుండగా... ఆమె ఎదురుతిరిగి కేకలు వేసింది. బయటకు వచ్చి డాక్టర్‌ తన పట్ల అసభ్యం గా ప్రవర్తించాడని నానా హంగామా సృష్టించింది . మీడియాను పిలిచి హడావిడి చేసింది. అదే సమయంలో ఆమె సంబంధీకులు ఆస్పత్రికి వచ్చి గొడవకు దిగారు. డాక్టర్‌పై దాడికి యత్నించారు. ఇదంతా కూడా ప్లాన్ లో భాగమే .

అసలు ఏం జరిగిందో బయటపెట్టిన సీసీ టీవీ ఫుటేజ్ .. డాక్టర్ పైనే కుట్ర అని తేల్చిన పోలీసులు

అసలు ఏం జరిగిందో బయటపెట్టిన సీసీ టీవీ ఫుటేజ్ .. డాక్టర్ పైనే కుట్ర అని తేల్చిన పోలీసులు

పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో మట్టెవాడ పోలీసులు కేసు విచారణ ప్రారంభించగా ఆసక్తికర విషయాలు బయటకువచ్చాయి. డాక్టర్‌ చాంబర్‌లో ఇతర వైద్యసిబ్బంది ఉండటం, సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కావడంతో సంధ్య తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు కూడా ఆ దిశగా విచారణ చేయడంతో కుట్ర కోణంతో పాటు తెరవెనుక పాత్రధారులు బయటకువచ్చారు. అసభ్యంగా ప్రవర్తించాడని డాక్టర్‌పై చేసిన ఫిర్యాదు అంతా బూటకం అని తేలింది. ఇక ఎంతో ప్లాన్ తో సుధీర్ కుమార్ పరువు తియ్యాలనుకున్న వారి కథ అడ్డం తిరిగింది. దీంతో వారు అడ్డంగా బుక్కయ్యారు . ప్రధాన నిందితుడైన నాగేశ్వర్‌రావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక ఆయనను పట్టుకుంటే అసలేం జరిగింది. ఎందుకు ఇదంతా చేశాడు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది.

English summary
A woman who went to the hospital in Warangal has been created a drama the doctor mis behaved with her. Some of their relatives attacked the hospital and created nuesense there . They filed suit against the doctor for not only sexually harassing him but also forcibly casting him in the name of caste. However, footage of the cc camera in this case showed that the woman was blindfolded. The police investigation revealed that there was a major conspiracy behind this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X