వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే పరీక్ష రాసిండ్రు.. ఎన్నికలు కాదులే..!

|
Google Oneindia TeluguNews

వరంగల్‌ : ఎమ్మెల్యే పరీక్షలు రాసిండ్రు. ఎన్నికల పరీక్షలు కాదు లెండి. ఎమ్మెల్యేగా క్షణం తీరిక లేకుండా ఉంటూనే చదువు కొనసాగిస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పరీక్షలు రాస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం న్యాయశాస్త్ర కోర్సు అభ్యసిస్తున్న క్రమంలో ఆయన వరంగల్ కేంద్రంలో పరీక్షలకు హాజరవుతున్నారు.

హన్మకొండ ఆదర్శ లా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న జీవన్ రెడ్డి ఇప్పుడు ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. అదే క్రమంలో శుక్రవారం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్య కేంద్రం భవనంలో నిర్వహించిన ఎల్‌ఎల్‌ఎం ఫైనలియర్ రెండో పేపరైన ఇన్సూరెన్స్ లా పరీక్షకు హాజరయ్యారు. అలా కెమెరా కంటికి చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

<strong>ఆదిలాబాద్ రాజకీయం.. గులాబీ పరిమళించేనా.. కమలం వికసించేనా?</strong>ఆదిలాబాద్ రాజకీయం.. గులాబీ పరిమళించేనా.. కమలం వికసించేనా?

armoor mla jeevan reddy writing llm exams

ప్రజా ప్రతినిధిగా నిత్యం క్షణం తీరిక లేకుండా గడిపే ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి న్యాయశాస్త్రంలో పట్టా పొందాలనేది ఆశయం. ఆ మేరకు ఆయన పట్టుదలతో చదువుతూ తన ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు. ఇదివరకు కూడా గతేడాది ఇలాగే పరీక్షలు రాస్తూ కెమెరా కంటికి చిక్కారు. టీఆర్ఎస్‌లో కీలక నేతగా వ్యవహరిస్తున్న జీవన్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా ముద్రపడ్డారు.

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2014లో టీఆర్ఎస్ ప్రభంజనం అందరకీ తెలిసిందే. ఆ సమయంలో జీవన్ రెడ్డి ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తొలిసారిగా గెలుపొందారు. తదనంతరం మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆర్మూర్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

English summary
Nizamabad District Armor Assembly Sector MLA Jeevan Reddy is writing exams. He is studying for an LLM law course from Kakatiya University and is attending exams at Warangal Center. Jeevan Reddy, who took admission at the Hanmakonda Adarsha Law College, is now writing the final year exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X