వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనుషుల్లో మృగాడు.!ఒళ్లు జలదరింపజేసిన సంజయ్ మృత్యు క్రీడ.!అతని క్రూరత్వానికి కారణం అదేనా.?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పదునైన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ చట్టాలు, వేగవంతమైన విచారణ, చట్టానికి ఏదీ అతీతం కాదు, దేశంలో ముంబాయి తర్వాత పటిష్టంగా పనిచేసే తెలంగాణ పోలీసు వ్యవస్ధ.. ఇలాంటి అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండికూడా కొంతమంది నేర ప్రవృత్తికి అలవాటుపడిపోడం, అమాయకులను, బంగారు భవిష్యత్తు ఉన్నవాళ్లను అతి దారుణంగా హతమార్చడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. చిన్న కారణాలతో, మరీ చిన్న నెపంతో నిండు ప్రాణాలను బలిదీసుకుంటున్నారు. పరిచయం ఉన్నవాళ్లను, అప్పటివరకు వాళ్లతో కలిసిమెలిసి ఉన్న వాళ్లను సైతం ప్రథకం ప్రాకారం మట్టు బెడుతూ వారిలో కృూరత్వాన్ని చాటుకుంటున్నారు కొంత మంది మృగాళ్లు.

ఆ బావిలో 9 శవాలు.. వరంగల్ లో వలస విషాదం ... వలస కార్మిక మరణాల మిస్టరీ ఏంటి ?ఆ బావిలో 9 శవాలు.. వరంగల్ లో వలస విషాదం ... వలస కార్మిక మరణాల మిస్టరీ ఏంటి ?

గొర్రెకుంట బావిలో తొమ్మిది శవాల మర్డర్ మిస్టరీ.. రెండు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు..

గొర్రెకుంట బావిలో తొమ్మిది శవాల మర్డర్ మిస్టరీ.. రెండు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు..

అంతే కాకుండా ప్రస్తుత సమాజంలో ఎవరితో స్నేహం చేయాలి..? ఎవరిని నమ్మాలి..? ఇంటిముందుకొచ్చి తాగడానికి నీళ్లడిగిన వాడికి నీళ్లు ఇవ్వాలా..?వద్దా.?అనే అర్ధం కాని రోజుల్లో కాలం వెళ్లదీస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాలో జరిగిన వరుస హత్యలు మంటగలిసి పోతున్న మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. బుగ్గి పాలవుతున్న మానవ సంబంధాలకు సజీవ సాక్షాలవుతున్నాయి. వరంగల్ సమీపంలోని గొర్రెకుంటలో ఏకాంగా తొమ్మిది మందిని అతికిరాతకంగా చంపిన ఉన్మాది చివరకు మూటకట్టుకున్న దేంటి..? అమాయకులైన పదిమంది ప్రాణాలు తీసి దారుణ మారణ కాండకు తెర తీసాడు తప్ప సంజయ్ ఒనగూర్చుకున్న దేంటి.?

రైలులో మొదటి హత్య.. మొత్తం 10 హత్యలు చేసిన కసాయి సంజయ్..

రైలులో మొదటి హత్య.. మొత్తం 10 హత్యలు చేసిన కసాయి సంజయ్..

అంత మందిని అంత నిర్ధాక్షిణ్యంగా హతమార్చడం వెనక అంత కరుడుగట్టిన కఠినత్వం ఉందా.? చంపాలనే క్రూరమైన ఆలోచన ఉద్బవించాడానికి కారణం ఏంటి..? అత్యంత కిరాతక చర్యలకు పాల్పడిన సంజయ్ మనోగతం ఏంటి..?అతడి నేపథ్యం ఒకసారి తెలుసుకుందాం. గొర్రెకుంటలో జరిపిన హత్యాకాండ బాదితుడు తెలుగువాడు కాదు. బదుకుదెరువు కోసం తెలంగాణ వచ్చి వరంగల్ లో తాత్కాలిక జీవనం కొనసాగిస్తున్నాడు. అంతే కాకుండా ఎవరినైనా సులువుగా నమ్మే తెలుగు వాళ్ల ఆశ్రయం పొంది వారితో సన్నిహితంగా ఉంటూ వారి మహిళా కుటుంబ సభ్యులపై కన్నేసి అత్యంత అమానవీయ కోణాన్ని ఆవిష్కరించాడు కసాయి సంజయ్.

రోమాలు నిక్కబొడుచుకునే నిజాలు.. సంజయ్ కిరాతకానికి బలైన అభాగ్యులు..

రోమాలు నిక్కబొడుచుకునే నిజాలు.. సంజయ్ కిరాతకానికి బలైన అభాగ్యులు..

ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా తొమ్మిది హత్యలు చేసాడంటే ఓ కుటుంబాన్ని మొత్తం బలితీసుకున్నట్టే లెక్క. తప్పు జరిగినందుకు క్షమాపణలు కోరాల్సిన సందర్బంలో మరో హత్య, దాన్నిండి తప్పించుకోవడానికి మరో హత్య.. మరో హత్య.. ఇలా వరుస హత్యలు చేస్తున్నా అతని అంతరాత్మ హెచ్చరించలేదంటే అతనిలో ఉన్మాదం ఏ స్థాయిలో తలకెక్కిందో అర్థం అవుతోంది. రాష్ట్రం కాని రాష్ట్రం బీహార్ నుండి వచ్చిన సంజయ్ కి తెలుగువాళ్లంటే చులకనభావం ఉండి ఉండాలి. నా రాష్ట్రం వాళ్లు కాదు కదా చంపితే ఏమందుతుందిలే అనే మొండి తెగింపు ఐనా ఉండి ఉండాలి. అసలు ఏమాత్రం చదువుకోని బీహారీలు తెలుగు రాష్ట్రాల్లో చాలవరకు భవన నిర్మాణ పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

ఎంత దారుణంగా చంపాడో అంతే కిరాతకంగా శిక్షించాలి.. డిమాండ్ చేస్తున్న వరంగల్ వాసులు..

ఎంత దారుణంగా చంపాడో అంతే కిరాతకంగా శిక్షించాలి.. డిమాండ్ చేస్తున్న వరంగల్ వాసులు..

కొన్ని సందర్బాల్లో వారివారి నేర ప్రవృత్తి భవన నిర్మాణ యజమానుల మందు ప్రదర్శిస్తుంటారు. నేరం చేయాలంటే ఎలాంటి మొహమాటపడని బీహారీలు, అదే కోవకు చెందిన సంజయ్ వరంగల్ జిల్లాలో తన వికృత క్రీడను, ఉన్మాద మనస్థత్వాన్ని ప్రదర్శించాడు. ఎదుటి వాడి ప్రాణమే కదా నాకేంటి సంబంధం అన్నట్టు వ్యవహరిస్తూ ఏకంగా పదిమందిని అత్యంత దారుణంగా చంపేసాడు కిరాతక సంజయ్. ఎదుటి వాడి ప్రాణాల విలువను, తప్పు చేస్తే పడే శిక్షలోని బాధను ఆ క్రూరిడికి తెలిసొచ్చేలా చేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.అకారణంగా పది మంది అభాగ్యుల ప్రాణాలు తీసిన సంజయ్ ని కూడా ఒక్క సారి చంపకుండా పది సంవత్సరాల చిత్రహింసను చూపించాలని వరంగల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Warangal residents have demanded ten years of torture without even killing Sanjay, who apparently killed ten innocent lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X