వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజీపీ ధర్నాలో అపశృతి.. బీజేపీ నేతలకు అంటుకున్న నిప్పు .. పోలీస్ వాహనం ధ్వంసం

|
Google Oneindia TeluguNews

వరంగల్ లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన పాశవిక చర్యకు నిరసనగా, దాడి చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు చేపట్టిన ధర్నాలో అపశృతి చోటుచేసుకుంది. ఇటీవల 9నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే మానవ మృగం అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బీజేపీ నేతలు చేసిన ధర్నా ఉద్రిక్తంగా మారింది . బీజేపీ నాయకులకు నిప్పంటుకుని గాయాలు కాగా పోలీస్ వాహనం ద్వంసం చేశారు ఆందోళనకారులు .

తొమ్మిదినెలల చిన్నారిపై దాడిపై చర్యలకు బీజేపీ ధర్నా .. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసే యత్నం

తొమ్మిదినెలల చిన్నారిపై దాడిపై చర్యలకు బీజేపీ ధర్నా .. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసే యత్నం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ చిన్నారి మృతి చెంది ఇన్ని రోజులైనా అభం శుభం తెలియని చిన్నారి మరణానికి కారణం అయిన కామాంధుడిని ఉరి తియ్యాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి పాల్పడ్డారు బీజేపీ నాయకులు. ఆందోళనలో భాగం గా నిర్వహిస్తున్న దిష్టిబొమ్మ దహనం అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

చంద్రబాబు వెన్నుపోటుకు.. ఎంపీల పిరాయింపుకు లింకు పెట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!? చంద్రబాబు వెన్నుపోటుకు.. ఎంపీల పిరాయింపుకు లింకు పెట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!?

అడ్డుకున్న పోలీసులు .. దిష్టిబోమ్మతో పాటు మంటలు అంటుకున్న బీజేపీ నేతలు

ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఇక అదే సమయంలో దిష్టిబొమ్మ దహనానికి సంబంధించిన కిరోసిన్ కార్యకర్తపై పడి కార్యకర్తకు, బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా రెడ్డి కి , అలాగే ఒక మహిళా కార్యకర్తకు నిప్పంటుకుంది. వీరిని ఆస్పత్రికి తరలించారు .అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో కొంత మంది పరుగులు తీశారు. మంటలు అంటుకున్న వారు హాహాకారాలు చేస్తూ పరుగు పెట్టారు. వెంటనే మిగతా వారు అలర్ట్ అయ్యారు. వారి శరీరానికి అంటుకున్న మంటలను ఆర్పివేశారు. దీంతో ఒకరు తీవ్ర గాయాల పాలు కాగా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స చేస్తున్నారు. శరీరంలో కొంత భాగం కాలిపోయిందని.. ప్రాణాపాయం లేదని వెల్లడించారు వైద్యులు.

 పోలీసుల అత్యుత్సాహమే ప్రమాదానికి కారణం అంటూ పోలీస్ వాహనం ధ్వంసం చేసిన బీజేపీ శ్రేణులు

పోలీసుల అత్యుత్సాహమే ప్రమాదానికి కారణం అంటూ పోలీస్ వాహనం ధ్వంసం చేసిన బీజేపీ శ్రేణులు

దిష్టిబొమ్మకు నిప్పంటించినప్పుడు అక్కడకు వచ్చిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. తోపులాటకు దారితీసింది. ఈ కారణంగానే బీజేపీ నేతలకు గాయాలయ్యాయి . ఇక దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు పోలీసుల వాహనాన్ని ద్వంసం చేశారు. పోలీస్ జులం నశించాలి అంటు నినాదాలు చేశారు. బీజేపీ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మను టీఆర్ఆర్ పార్టీ టార్గెట్ చేసి టీఆర్ఎస్ ప్రోద్భలంతోనే సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి దిష్టిబొమ్మపై పెట్రోల్ పోసి ప్రమాదాన్ని సృష్టించాడని బీజేపీ ఆరోపిస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
In Dharna, BJP leaders held a protest demanding severe punishment of the accused who attacked the nine-month-old baby girl in Warangal. Recently, a 9-month-old baby girl was allegedly raped and murdered by a psycho Praveen . The dharna of BJP leaders demanding severe punishment of the accused has become furious. The BJP leaders tried to burn the CM's effigy and the police tried to stop the burning of effigy . in this tension bjp leaders had set fire and they injured. because of the over action of police this incident happened .. police vehicle was damaged by the BJP activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X