• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కొండా సురేఖ అంతరంగం: హుజురాబాద్ నుంచి పోటీ చేస్తా.. కానీ అని మెలిక.. ఆ షరతు

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్ఫామ్ కాలేదు. పలువురి పేర్లను పరిశీలించిన హైకమాండ్.. సామాజిక సమీకరణాల ఆధారంగా కొండా సురేఖ వైపు మొగ్గుచూపారు. అంతకుముందు పొన్నం ప్రభాకర్ పేరు కూడా వినిపించింది. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగడం ఖాయం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఈ క్రమంలో కొండా సురేఖ తన మనసులో మాటను బయటపెట్టారు.

Anasuya Bharadwaj :చీరలో కూడా గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న యాంకర్ అనసూయ.. బ్యూటీఫుల్ ఫొటోస్

పోటీ చేస్తా.. కానీ

పోటీ చేస్తా.. కానీ

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో పోటీపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు తనను పోటీచేయాలని తమ పార్టీ నేతలు కోరుతున్నారని తెలిపారు. హుజురాబాద్‌లో పోటీ చేసినా.. మళ్లీ వరంగల్‌కే వస్తానని చెబుతున్నారు. అంటే 2023లో మళ్లీ వరంగల్ నుంచి పోటీ చేస్తానని.. హుజురాబాద్ నుంచి పోటీ చేయనని ఆమె షరతు విధిస్తున్నారు. తనకు అలాంటి హామీ వస్తేనే హుజురాబాద్‌లో పోటీచేస్తానని కొండా సురేఖ తెలిపారు.

purvimundada: వామ్మో ఏమిటి ఈ అందం ... టాప్ లెస్ ఫొటోలతో రెచ్చిపోతున్న హాట్ బ్యూటీ (ఫొటోస్)purvimundada: వామ్మో ఏమిటి ఈ అందం ... టాప్ లెస్ ఫొటోలతో రెచ్చిపోతున్న హాట్ బ్యూటీ (ఫొటోస్)

కన్ఫామ్..?

కన్ఫామ్..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపు ఖరారైంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 2018 శాసనసభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి అనుకున్న దానికన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. వాటిని నిలుపుకొంటే.. త్రిముఖ పోటీ జరిగి రేసులో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ తమ అభ్యర్థులుగా బీసీలనే బరిలోకి దించుతున్న నేపథ్యంలో బీసీ వర్గానికే చెందిన కొండా సురేఖ వంటి బలమైన నేతను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇరు కులాలు కలిసి

ఇరు కులాలు కలిసి

కొండా సురేఖ సామాజికవర్గమైన పద్మశాలీ, ఆమె భర్త కొండా మురళి సామాజికవర్గమైన మున్నూరుకాపులూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ రెండు సామాజికవర్గాలకు తోడు ఇతర బీసీ సామాజికవర్గాల్లోని ఓట్లూ కలిసి వస్తే తామే చాంపియన్‌గా నిలవచ్చని కాంగ్రెస్‌ అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకోసమే కొండా సురేఖ వైపు మొగ్గుచూపారు. ఇంతలో కొండా సురేఖ కూడా క్లారిటీ ఇచ్చారు.

బలమైన నేత

బలమైన నేత

వరంగల్‌ జిల్లాలో పట్టు ఉన్న కొండా సురేఖను హుజురాబాద్‌ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ భావిస్తోంది. వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల‌, భూపాల ప‌ల్లి నియోజ‌క వ‌ర్గాల్లో బల‌మైన నేత‌గా ఉన్న కొండా సురేఖ‌ను బరిలోకి దించాలని అనుకుంటుంది. కొండా సురేఖ సామాజిక వర్గం ప‌ద్మశాలి, ఆమె భర్త సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వ‌ర్గాల‌ ఓట్లు హస్తం గుర్తుకు పడతాయని అంచనా వేస్తున్నారు.

మంత్రుల మకాం..

మంత్రుల మకాం..

మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ హుజురాబాద్‌లోనే మకాం వేసి కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపుతున్నారు. ఇదివరకు చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ.. టీఆర్ఎస్‌ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. అటు ఈటల భార్య జమున సైతం హుజురాబాద్‌లోని పలుగ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో రానున్న రోజుల్లో తేలిపోనుంది. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. అందులో భాగంగానే కొండా సురేఖ పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది.

దళితబంధువు

దళితబంధువు

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి.

నిధులు విడుదల

నిధులు విడుదల

దళిత బంధు పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కూడా పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నందున.. పథకం తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో నిధులు కూడా రిలీజ్ చేశారు. అయితే మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. బై పోల్ కోసం హుజురాబాద్‌లో కొందరినీ ఎంపిక చేసి.. ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరీ మిగతా వారి సంగతి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. హుజురాబాద్‌లో ఇప్పటికే అర్హులను ఎంపిక చేసి.. నగదు కూడా జమ చేశారు. ఈ క్రమంలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
contest huzurabad by poll konda surekha said. she one condition to high command. 2023 elections she will be contest only warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X