వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్ : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా వరంగల్ జిల్లాలో ఏకంగా ఏడుగురికి కరోనా పాజిటివ్ !!

|
Google Oneindia TeluguNews

కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ మార్గమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రజలకు కరోనా మహమ్మారి నుండి రక్షించే కోవిడ్ టీకాలను ఇస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా మహమ్మారి సోకదని గ్యారెంటీ లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రెండు సార్లు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కోవిడ్ పాజిటివ్

రెండు సార్లు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కోవిడ్ పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు అనేక మందికి కరోనా టీకాలను రెండు డోసులు ఇచ్చారు. రెండు సార్లు టీకా తీసుకున్న వారిని కూడా కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇటీవల వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డారు .

వరంగల్ లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఏడుగురికి కరోనా

వరంగల్ లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఏడుగురికి కరోనా

ఇక కీర్తి నగర్ యు పి హెచ్ సి లో కూడా 4 రోజుల క్రితం 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు అనారోగ్యంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు . వారిలో ఏడుగురు రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా సోకడంతో వారు లబోదిబోమంటున్నారు. ఇక దీనిపై వరంగల్ అర్బన్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా జాగ్రత్తలు పాటించాల్సిందేనని, వ్యాక్సిన్ వేయించుకున్నంతమాత్రాన కోవిడ్ సోకదని గ్యారెంటీ లేదని వెల్లడించారు.

 వ్యాక్సినేషన్ తర్వాత కరోనా సోకినా నో రిపోర్ట్ .. నో మెసేజ్ .. టెక్నికల్ ప్రాబ్లమ్

వ్యాక్సినేషన్ తర్వాత కరోనా సోకినా నో రిపోర్ట్ .. నో మెసేజ్ .. టెక్నికల్ ప్రాబ్లమ్

వ్యాక్సిన్ చేసిన తర్వాత కరోనా సోకిన వారికి కరోనా పాజిటివ్ అని అధికారులు రిపోర్టును చేతికి ఇవ్వడం లేదు. ఇక మొబైల్ కి సైతం కరోనా పాజిటివ్ అని సందేశం పంపించడం లేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి పాజిటివ్ అని రిపోర్ట్ వస్తే దానిని పోర్టల్ లో తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. టెక్నికల్ గా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి పాజిటివ్ నమోదు చెయ్యటంలో ఇబ్బంది ఉందని అంటున్నారు . ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ రిపోర్ట్ ఇస్తేనే అధికారులు సెలవు మంజూరు చేస్తామని చెబుతున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు.

 వ్యాక్సిన్ తీసుకున్నా 100 శాతం సురక్షితం కాదు .. అప్రమత్తత అవసరం

వ్యాక్సిన్ తీసుకున్నా 100 శాతం సురక్షితం కాదు .. అప్రమత్తత అవసరం


ఇప్పటికే చాలా మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు, తమకు కరోనా సోకదు అన్న భ్రమలో జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారు సైతం కరోనా బారినపడుతున్నారు . ఇప్పటికే చాలా మంది వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు పలువురు వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా పలువురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నుండి రక్షణ లేదు అన్న భావనకు కారణం అవుతుంది . అయితే వైద్యులు మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతకాలం కోవిడ్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని , లేదంటే కరోనా సోకే ప్రమాదం ఉందని అంటున్నారు.

English summary
corona positive continue to come to light even after taking two doses of the corona vaccine. Seven people have recently been vaccinated in two doses in the Warangal Urban District. However, their corona was positive. Although two doses of the vaccine have been given, they are not protected from corona infection. Dr Lalitadevi, DMHO, Warangal Urban District, said that even after taking the corona vaccine, precautions should be taken and there is no guarantee that the vaccine prevention of virus .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X