వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో మరో కరోనా వారియర్ బలి - మహబూబాబాద్ డీఎస్పీ శశిధర్​ మృతి

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తున్నది. కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ లో ఉన్న మరో వారియర్ వైరస్ కాటుకు గురికావడం విషాదకరంగా మారింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) శశిధర్ కరోనాతో ప్రాణాలు విడిచారు.

విజయసాయిరెడ్డి.. ఇంకా పులుపు చావలే - అమరావతిలో సునామి - టీడీపీ ఫైర్ - గోల్కొండను లోకేశ్ కట్టాడా?విజయసాయిరెడ్డి.. ఇంకా పులుపు చావలే - అమరావతిలో సునామి - టీడీపీ ఫైర్ - గోల్కొండను లోకేశ్ కట్టాడా?

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) విభాగంలో డీఎస్పీగా పనిచేస్తోన్న శశిధర్ కొవిడ్ వ్యాధికి చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరోనాకు తోడు ఇతర వ్యాధులు కూడా ఉండటంతో ప్రాణాలు కాపాడుకోవడం కష్టమైందని డాక్టర్లు చెప్పారు. డీఎస్పీ శశిధర్ మృతి పట్ల జిల్లా పోలీస్ అధికారులు సంతాపం తెలిపారు.

covid-19: mahabubabad ar dsp sashidhar dies of coronavirus

తెలంగాణలో కరోనా వారియర్ల వరుస మరణాలపై విమర్శలు కూడా వచ్చాయి. కరోనా కట్టడి, చికిత్స విధుల్లో ముందుభాగాన ఉండి పోరాడుతోన్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి అవసరమైన రక్షణ వస్తువుల్ని అందించడంలో కేసీఆర్ సర్కారు ఫెయిలైందని, అందుకే వారియర్లు వరుసగా చనిపోతున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో పది మందికిపైగా డాక్టర్లు, పోలీసులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

కొత్త జిల్లాలపై జగన్ సర్కారు ట్విస్ట్ - రాత్రికిరాత్రే జీవో సవరణ - సవాళ్లు - ఏపీలో కేసీఆర్ ఫార్ములా?కొత్త జిల్లాలపై జగన్ సర్కారు ట్విస్ట్ - రాత్రికిరాత్రే జీవో సవరణ - సవాళ్లు - ఏపీలో కేసీఆర్ ఫార్ములా?

ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 1256 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,751కి, మరణాల సంఖ్య 637కు పెరిగాయి. రాష్ట్రంలో రికవరీలు కూడా మెరుగ్గా ఉండటంతో ఇప్పటికే 57,586 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 22,528గా ఉంది.

English summary
another corona warriors died in telangana as state's tally crosses 80k mark. mahabubabad dsp sashidhar dies of covid-19 on monday. district police officials expressed greaf over dsp death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X