వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముంపులోనే ఓరుగల్లు ... చరిత్రలోనే మొదటిసారి .. వేలాది ప్రజల కన్నీటి వరద

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ , కరీంనగర్ , ఖమ్మం జిల్లాలను వానలు ముంచెత్తుతున్నాయి. విపరీతంగా గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు నీటమునిగాయి. చారిత్రక ఓరుగల్లు నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా వర్ష బీభత్సానికి నగరంలోని 70 ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. గత 24 గంటల్లో 13.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Recommended Video

Telangana Floods: Warangal, Karimnagar and Khammam districts were Affected
జలదిగ్బంధంలో ఓరుగల్లు ... రెండు ,మూడు మీటర్ల మేర వరదనీరు

జలదిగ్బంధంలో ఓరుగల్లు ... రెండు ,మూడు మీటర్ల మేర వరదనీరు


ఓరుగల్లులో వర్ష బీభత్సానికి కన్నీటి వరద కొనసాగుతుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.ఇక ఓరుగల్లు మహా నగరంలో ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.వేలాదిగా ప్రజలు వర్ష బీభత్సానికి నిరాశ్రయులై కన్నీటి పర్యంతం అవుతున్నారు .
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతోంది. ఓరుగల్లు నగరం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చిగురుటాకులా వణుకుతోంది . కాలనీల్లో, రోడ్లమీద ఎటు చూసినా రెండు మూడు మీటర్ల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయి.జలదిగ్బంధంలో పలు కాలనీలు చిక్కుకున్నాయి.

కాలనీల్లో పరిస్థితి హృదయ విదారకం .. 13 పునరావాస కేంద్రాల ఏర్పాటు

కాలనీల్లో పరిస్థితి హృదయ విదారకం .. 13 పునరావాస కేంద్రాల ఏర్పాటు

వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్ లో ఎక్కడ చూసినా ముంపుకు గురైన కాలనీలు హృదయవిదారకంగా తోస్తున్నాయి. ప్రజలను అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.

ఓరుగల్లు నగరంలో మొత్తం 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నాలుగు బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు ఎప్పుడూ ముంపుకు గురికాని కాలనీలు కూడా ఈసారి వరద ప్రభావానికి లోనయ్యాయి .

 నీట మునిగిన ట్రాన్స్ ఫార్మర్లు .. నిలిచిన విద్యుత్ సరఫరా

నీట మునిగిన ట్రాన్స్ ఫార్మర్లు .. నిలిచిన విద్యుత్ సరఫరా


మరో రెండు రోజులపాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ఇస్తున్న హెచ్చరికలతో ప్రజలు భయం గుప్పిట్లో ఉంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల గ్రామాలకు ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునగడంతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. వరద నీటిలో కార్లు, బస్సులు, లారీలు చిక్కుకున్నాయి.

నగర ప్రధాన రహదారులపై కూడా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది .పలు కాలనీలలో ఐదు అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు ఇళ్లను వదిలి కట్టుబట్టలతో సహాయ శిబిరాలకు తరలివెళ్లారు.

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ .. బోట్ల సహాయంతో తరలింపు

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ .. బోట్ల సహాయంతో తరలింపు


పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, బోట్ల సహాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు 3000 మందికి సహాయక శిబిరాల్లో ఆశ్రయం కల్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ పశ్చిమఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ, అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

 కొట్టుకుపోయిన రోడ్లు , పొంగి ప్రవహిస్తున్న చెరువులు

కొట్టుకుపోయిన రోడ్లు , పొంగి ప్రవహిస్తున్న చెరువులు

వరద ప్రభావంతో ప్రధాన రహదారులు కూడా కోతకు గురై రోడ్లు కొట్టుకుపోయాయి. వర్ష బీభత్సం ఇలా కొనసాగితే మరిన్ని కాలనీలు నీట మునిగే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అవసరమున్నాఅధికార యంత్రాంగం దృష్టికి తీసుకు రావాలని చెబుతున్నారు.
ఒకపక్క నగరంలోని చెరువులు ఉధృత రూపం దాల్చాయి. భద్రకాళీ చెరువు పొంగి ప్రవహిస్తుంది. గోపాలపురం చెరువు, హసన్ పర్తి చెరువు , వడ్డేపల్లి చెరువు , బంధం చెరువులు పొంగుతున్నాయి . దీంతో కాలనీల్లోకి నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది.

English summary
The rains are making the state of Telangana unbearable. The joint Warangal, Karimnagar and Khammam districts were particularly affected by the monsoon. Many colonies were inundated with torrential rains over the past five days. Historic record flooded 70 areas of the city for the first time ever before with torrential rains. 13.4 cm of rainfall was recorded in the last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X