వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్‌కౌంటర్స్: గడ్చిరోలిలో ఐదుగురు మావోయిస్టులు మృతి, ములుగులో ఇద్దరు

|
Google Oneindia TeluguNews

వరంగల్: ములుగు జిల్లా మంగపేట అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదరురుకాల్పులు జరిగాయి. మంగపేట అటవీ ప్రాంతంలోని ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు తారసపడటంతో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ముందుగా మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఎదురుకాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.

గడ్చిరోలిలో ఎదురుకాల్పులు: ఐదుగురు మావోలు మృతి

Five Naxals Killed in Gunbattle With Cops in Gadchiroli District, 2 killed in telangana

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. కోస్మి-కిస్నేలి అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని గడ్చిరోలి ఎస్పీ తెలిపారు.

గడ్చిరోలి పోలీసు బలగానికి చెందిన సీ-60 కమాండోలు ధనోరా తాలూకాలో ఆదివారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో కమాండోలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. అయితే, మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియరాలేదు.

English summary
The Maharashtra Police on Sunday gunned down five Naxals during an exchange of fire in the Gyarapatti area of Gadchiroli district. The face-off took place at Kosmi-Kisneli forest around 4pm, the Gadchiroli Superintendent of Police (SP) office said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X