వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొరడా లేచింది..! కలప స్మగ్లర్లకు ఇక చుక్కలేనా?

|
Google Oneindia TeluguNews

వరంగల్ : కలప స్మగ్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జంగల్ బచావో, జంగల్ బడావో అంటున్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు.. అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు కేసీఆర్. అవసరమైతే కలప స్మగర్లపై పీడీ యాక్టులు పెడతామని హెచ్చరించారు.

కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో కలప స్మగ్లర్ల డొంక కదులుతోంది. ఆ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
పలిమెల మండలంలోని సర్వాయిపేట అడవుల్లో అక్రమ కలప నిల్వలను గుట్టురట్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసుల సాయం తీసుకుని ఆ స్థావరంపై అటాక్ చేశారు. దాదాపు 6 లక్షల రూపాయల విలువ చేసే 56 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కర్రను కోసే యంత్రాలు కూడా సీజ్ చేశారు. అనంతరం మహదేవపూర్ డిపోకు తరలించారు.

forest officials attacked on wood den

అడవులను సంరక్షించాలనే ఉద్దేశంతో, పూచిక పుల్ల కూడా బయటకు పోవద్దనే కేసీఆర్ సూచనల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అలర్టయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కలప స్థావరాలపై దాడులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే భూపాలపల్లి జిల్లాలో ఆకస్మిక దాడులు చేసినట్లు సమాచారం.

English summary
forest officials attacked on wood den in jayashankar bhupalapally district. They found six lakh rupees worth of 56 wood logs and seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X