వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుట్టింది ఆడపిల్ల అని .. గొంతులో వడ్ల గింజ వేసి ప్రాణం తీసి.. ఆపై

|
Google Oneindia TeluguNews

ఆడపిల్ల ఇంటికి లక్ష్మీ అని చెప్పినా, అన్ని రంగాల్లో ఆడపిల్లలు, మగ పిల్లలకు ఏ మాత్రం తీసిపోరు అని చెబుతున్నా, అభివృద్ధిలో పరుగులు తీస్తున్న నేటి సమాజం లోనూ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. గర్భంలో ఉన్న బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తే ఆ పిండాన్ని గుట్టుచప్పుడు కాకుండా భ్రూణహత్యలకు పాల్పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక పుట్టిన తరువాత ఆడపిల్లలను విక్రయిస్తున్న వారు, లేదా గుర్తు చప్పుడు కాకుండా అంతమొందిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు.

గుంటూరులో టెన్షన్.. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ .. ఐదుగురికి గాయాలుగుంటూరులో టెన్షన్.. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ .. ఐదుగురికి గాయాలు

రెండో కాన్పులో ఆడపిల్ల .. గుట్టు చప్పుడు కాకుండా హతమార్చిన తాత

రెండో కాన్పులో ఆడపిల్ల .. గుట్టు చప్పుడు కాకుండా హతమార్చిన తాత

ఆడపిల్లల మీద కొనసాగుతున్న వివక్ష ను తగ్గించడానికి, భ్రూణ హత్యలు నివారించడానికి, ఆడశిశువుల విక్రయాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నా రాష్ట్రంలో ఎక్కడో ఏదో ఒక చోట ఇంకా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా రెండోకాన్పులో కూడా ఆడపిల్ల పుట్టిందని ఓ తాతే స్వయంగా ఆ పసికందును అంతమొందించాడు. తల్లి గర్భము నుండి బయటకు వచ్చి రాగానే ఆడపిల్ల అని తెలియగానే , పసికందు అని కనీసం జాలి కూడా లేకుండా ఆ శిశువును హత్య చేశాడు.
వరంగల్ జిల్లాలో జరిగిన ఈ దారుణమైన సంఘటన ఆడపిల్లలపై కొనసాగుతున్న వివక్షపై నాగరిక సమాజాన్ని మరోమారు ప్రశ్నిస్తుంది.

పాప మృతిపై అనుమానంతో చైల్డ్ లైన్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు

పాప మృతిపై అనుమానంతో చైల్డ్ లైన్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు

స్థానికుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేశవపురం గ్రామ శివారుల్లో ఎర్రకుంటతండాకు చెందిన దంపతులకు మొదటి సంతానం ఆడపిల్ల కాగా, రెండవ సంతానంగా ఈనెల 4న వర్థన్న పేట ప్రభుత్వాసుపత్రిలో మరో పాప జన్మించింది. చాలా ఆరోగ్యంగా జన్మించిన శిశువు ఉన్నట్టుండి విగతజీవి అయింది. ఈనెల 5న చిన్నారిని తల్లిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఈనెల7న పాప చనిపోయిందని తల్లిదండ్రులు, తాత నాయనమ్మలు పాపను తమ వ్యవసాయ భూమిలోనే గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. అయితే చుట్టుపక్కల వాళ్లకు వీళ్ల తీరుపై అనుమానం కలగటంతో వెంటనే చైల్డ్ లైన్ అధికారులు సమాచారం అందించారు.

రంగంలోకి చైల్డ్ లైన్ అధికారులు .. చిన్నారికి పోస్ట్ మార్టం .. క్రిమినల్ కేసు పెట్టమన్న కలెక్టర్

రంగంలోకి చైల్డ్ లైన్ అధికారులు .. చిన్నారికి పోస్ట్ మార్టం .. క్రిమినల్ కేసు పెట్టమన్న కలెక్టర్

వెంటనే రంగంలోకి దిగిన చైల్డ్ లైన్ అధికారులు పాప మరణానికి గల కారణాలను చిన్నారి ఇంటికి వచ్చి ఎంక్వయిరీ చేశారు. పుట్టినప్పుడు పాప బలహీనంగా ఉందని తీవ్ర జ్వరంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కుటుంబసభ్యుల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు చిన్నారికి పోస్టు మార్టమ్ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. రెండో కాన్పులో కూడా ఆడపిల్ట పుట్టిందని పాపను చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. చిన్నారి గొంతులో వడ్లగింజ వేసి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అధికారులు. ఇక ఈ ఘటనపై పాప మృతికి కారణమైన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. మొత్తానికి ఆడపిల్ల భారమని భావించి తాత పసికందును హతమార్చారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

English summary
In the second delivery, the baby was born again, Thegrand father of the babay killed her without the least pity.This horrific incident in the Warangal district once again questioned the civilized society over the ongoing discrimination against girls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X