వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్ద సారుకు చెప్పు దెబ్బ.. లైంగికంగా వేధించాడని చెంప చెళ్లు..!

|
Google Oneindia TeluguNews

జనగామ : ఉన్నత ఉద్యోగాల్లో ఉంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నీచపు అధికారులకు తగిన శాస్తి జరుగుతోంది. ఇటీవల వెలుగుచూసిన పలు ఘటనల్లో సదరు అధికారులకు చెప్పు దెబ్బలు పడుతూనే ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తూ లైంగిక వాంఛలు తీర్చాలంటూ వెంటపడుతున్న పోకిరీ సార్లకు వడ్డింపులు తప్పడం లేదు. ఆ క్రమంలో మహిళా ఉద్యోగి తన ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టిన ఘటన జనగామలో ఆలస్యంగా బయటపడింది. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ శాఖలో వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్‌.. అదే కార్యాలయంలో ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళను కొంతకాలంగా వేధిస్తున్నాడు. తాను చెప్పినట్లు నడుచుకుంటే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే సహనంతో అతడిని ఎదిరించలేకపోయిన సదరు మహిళా ఉద్యోగి చివరకు అతడి తీరుతో బేజారయ్యారు.

higher official slapped by chappal from woman employee

స్కూల్‌లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్.. బాలిక ఫిదా.. ఇదో కొత్త కహానీ..!స్కూల్‌లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్.. బాలిక ఫిదా.. ఇదో కొత్త కహానీ..!

ప్రతినిత్యం అదే తంతు కొనసాగడంతో ఆమె స్థానిక నేతను సంప్రదించింది. తన ఉన్నతాధికారి వేధిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. దాంతో ఆయన సదరు ఆఫీసర్‌ను కడిగిపారేశారు. మరోసారి రిపీట్ ఐతే డీసీపీకి చెబుతానని హెచ్చరించారు. అయినా కూడా ఆ ఉన్నతాధికారి తీరులో మార్పు రాలేదు. దాంతో సహనం కోల్పోయిన కాంట్రాక్టు మహిళా ఉద్యోగి అదే కార్యాలయంలో అతడిని చెప్పుతో కొట్టారు.

చెప్పుతో కొడితే గానీ బుద్ధిరాని సదరు ఆఫీసర్ చివరకు ఆమె కాళ్ల మీద పడ్డాడు. తన వల్ల తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు. అందరిముందు సదరు మహిళా ఉద్యోగి తనను చెప్పుతో కొట్టడంతో కళ్లు తెరిచాడు. అయితే ఇది జరిగి దాదాపు 15 రోజులవుతున్నా ఇంతవరకు బయటకు రాలేదు. ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. అదలావుంటే విషయం కాస్తా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆ అధికారిని విచారించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

English summary
Janagaon Minority Welfare Officer Srinivas Slapped by Woman Employee for abusing. This incident happen before 15 days, but not came into lime light. But, District Collector ordered to invesigate in detailed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X