వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్కారీ దవాఖానలో కలెక్టరమ్మ డెలివరీ.. తల్లీ బిడ్డ సేఫ్, ఎక్కడంటే..?

|
Google Oneindia TeluguNews

సర్కార్ దవాఖానలో వైద్యం అంటే మరింత నమ్మకం కలగాలి.. అంటే అధికారులో.. నేతలు వైద్యం చేయించుకోవాలి. అయితే తొలి నుంచి సర్కారీ వైద్యం అంటే కాస్త నిర్లక్ష్యం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇదీ రుజువు అయ్యింది కూడా.. ఇప్పుడు ఓ ఐఏఎస్ అధికారి సర్కారీ ఆస్పత్రిలో డెలివరీ అయ్యింది.

తెలంగాణ‌కు చెందిన మ‌హిళా ఐఏఎస్ అధికారిణి‌‌ త్రిపాఠి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో డెలివరీ చేయించుకున్నారు. ఆమె పండంటి మగ బిడ్డకు జ‌న్మ‌నిచ్చారు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన త్రిపాఠి ములుగు జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ (స్థానిక సంస్థ‌లు)గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. జిల్లాకు పొరుగునే ఉన్న జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఆమె భ‌ర్త‌ భ‌వేశ్ మిశ్రా ప‌నిచేస్తున్నారు.

ias officer delivered at government hospital

త్రిపాఠికి సోమ‌వారం రాత్రి పురిటి నొప్పులు ప్రారంభం కాగా... ఆమెను భ‌వేశ్ మిశ్రా భూపాల‌ప‌ల్లిలోని ఏరియా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. విష‌యం తెలుసుకున్న ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ సంజీవ‌య్య ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న గైన‌కాల‌జిస్ట్‌ను ర‌ప్పించారు. సాధార‌ణ ప్ర‌స‌వానికే వైద్యులు య‌త్నించ‌గా.. గ‌ర్భంలోని మ‌గ శిశువు బ‌రువు అధికంగా ఉండ‌టంతో సోమ‌వారం రాత్రి సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ చేసి..ప్రసవం చేశారు.

ప్ర‌స‌వం త‌ర్వాత త‌ల్లీబిడ్డ‌లు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో స‌ర్కారీ ఆసుపత్రుల్లో పెరిగిన వ‌సతుల‌కు నిద‌ర్శ‌నం ఈ ఘ‌ట‌న అని టీఆర్ఎస్‌ పార్టీ నేత‌లు అంటున్నారు.

English summary
ias officer tripati delivered at government hospital. mother, new born boy are healthy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X