వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్... విస్తృతంగా పోలీసుల తనిఖీలు

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. మావోయిస్టు యాక్షన్ టీం లు జిల్లాలో సంచరిస్తున్నాయన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలో అన్ని ఏరియాల్లోనూ పోలీసులు వాహన తనిఖీలు చేయడంతో పాటుగా, మావోయిస్టు అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల అణచివేతకు సిద్ధం చేసిన ఆపరేషన్ ప్రహార్ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మావోల అణచివేతకు దిగుతున్నాయి.

 ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు .. మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు .. మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్

చత్తీస్ గడ్ , మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఈ క్రమంలో మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలలో సంచరిస్తున్నారు అన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. యాక్షన్ టీంలు జిల్లాలోకి ప్రవేశించాయన్న సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోపక్క మావోయిస్టులు కూడా ఏ మాత్రం తగ్గకుండా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ముసలమ్మ గుట్ట వద్ద ఎన్ కౌంటర్ పై మావోల లేఖ

ముసలమ్మ గుట్ట వద్ద ఎన్ కౌంటర్ పై మావోల లేఖ

ములుగులో టిఆర్ఎస్ నాయకుడిని హతమార్చిన తరువాత పోస్టర్లు వేసిన మావోయిస్టులు కూంబింగ్ ఆపకుంటే ముందు ముందు దారుణ పరిణామాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక తాజాగా ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మ గుట్ట వద్ద టిఆర్ఎస్ ప్రభుత్వం దొంగ ఎన్ కౌంటర్ తో ఇద్దరు ఆదివాసి బిడ్డలను హత్య చేసింది అంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మారణకాండను ప్రజాస్వామిక వాదులు, ప్రజలు తీవ్రంగా ఖండించాలని మావోలు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ నిరంకుశ పాలన.. బూటకపు ఎన్ కౌంటర్లు అంటూ ఫైర్

టీఆర్ఎస్ నిరంకుశ పాలన.. బూటకపు ఎన్ కౌంటర్లు అంటూ ఫైర్

టిఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రతిఘటించండి అంటూ మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. హక్కుల సంఘాలు నిజనిర్ధారణ చేసి, హైకోర్టు ద్వారా న్యాయ విచారణ చేపట్టి హత్యలకు పాల్పడిన పోలీసులను శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు ఇన్ఫార్మర్ల ద్వారా హత్యలకు తెగబడుతున్నారు అని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్, కెసిఆర్ ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తూ బూటకపు ఎన్కౌంటర్లను కొనసాగిస్తోందని నిరంకుశ పాలన సాగిస్తోందని మండిపడ్డారు.

జిల్లా మొత్తం అలెర్ట్ .. పట్టణాలు ,నగరంలోనూ తనిఖీలు

జిల్లా మొత్తం అలెర్ట్ .. పట్టణాలు ,నగరంలోనూ తనిఖీలు

ఇదే సమయంలో పోలీసులు అటవీ ప్రాంతంలోనే కాకుండా గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులకు ఎవరు సహకరించిన కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.
మాజీ నక్సలైట్ల సహాయంతో మావోల ఉనికి కనిపెట్టే పనిలో ఉన్నారు . గతంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ తర్వాత మావోలు పెద్దగా యాక్టివిటీస్ సాగించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మావోయిస్టులు ఒకపక్క పోలీసులు తనిఖీలు చేస్తున్నా , ఎన్ కౌంటర్ లు చేస్తున్నా సరే తమ ఉనికి చాటుతూనే ఉన్నారు .

English summary
A cold war is raging between the Maoists and the police in the joint Warangal district. Police are conducting sudden inspections with information that Maoist action teams are roaming in the district. Police are conducting vehicle inspections in all areas of the district and sifting through suspected Maoist areas. In the wake of Operation Prahar, which was planned by the central government to suppress the Maoists, the state governments are also embarking .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X