• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వివాహితకు లైంగిక వేధింపులు.. సొంత మరిది టార్చర్.. భరించలేక చివరకు..!

|

ఏటూరు నాగారం : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. సొంత మరిది వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జిల్లాలో చర్చానీయాంశమైంది. భర్త చనిపోయిన తర్వాత మరిది ఆగడాలు ఎక్కువ కావడంతోనే సూసైడ్ చేసుకుందని ఆమె తల్లి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత ఆత్మహత్య.. శంకరాజ్ పల్లిలో విషాదం

వివాహిత ఆత్మహత్య.. శంకరాజ్ పల్లిలో విషాదం

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం మండలం శంకరాజ్ పల్లికి చెందిన శ్రీదేవి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె సూసైడ్ చేసుకోవడంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతికి గల కారణాలను ఆమె సోదరుడు కె.అర్జున్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. శనివారం మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడిన అర్జున్.. బావ చనిపోవడంతో తమ సోదరిని ఆయన తమ్ముడు వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు.

హయత్‌నగర్ టు ఆమన్‌గల్ .. కీర్తి రెడ్డికి అబార్షన్ చేసిందెవరు.. తల్లి హత్య కేసులో మరో కోణం..!

అన్న చనిపోవడంతో వదినను వేధిస్తున్నాడనే ఆరోపణలు

అన్న చనిపోవడంతో వదినను వేధిస్తున్నాడనే ఆరోపణలు

శంకరాజ్ పల్లికి చెందిన తాటిపల్లి వెంకటయ్యకు పదమూడేళ్ల కిందట శ్రీదేవితో వివాహం జరిగింది. అయితే నాలుగు సంవత్సరాల కిందట ఆయన గుండె పోటుతో చనిపోయారు. వారికి ఓ బాబు ఉన్నాడు. అయితే వెంకటయ్య చనిపోయిన ఏడాది తర్వాత నుంచి ఆయన తమ్ముడు రామయ్య తమ చెల్లెను వేధిస్తూ వచ్చాడని వాపోయారు శ్రీదేవి అన్న అర్జున్. ఆ క్రమంలో శ్రీదేవిని సూటిపోటి మాటలతో వేధించడమే గాకుండా లైంగికంగా కూడా సతాయించేవాడని చెప్పుకొచ్చారు.

పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ జరిగినా..!

పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ జరిగినా..!

రామయ్య తీరు మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదని.. ఆ క్రమంలో పెద్ద మనుషుల దగ్గర పంచాయితీ పెట్టించినా పద్దతి మార్చుకోలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటవ తేదీన శ్రీదేవి పొలం పనులు చూసుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రామయ్య అడ్డుపడి ఆమెను వాళ్లింటికి తీసుకుపోయాడని ఆరోపించారు. కోరిక తీర్చాలంటూ బలవంతం చేయడంతో శ్రీదేవి ప్రతిఘటించిందని.. ఆ కోపంలో రామయ్యతో పాటు అతడి భార్య పోషమ్మ కలిసి ఆమెపై అఘాయిత్యం చేయబోయారని వివరించారు.

ఆనాడు బీజేపీకి సై.. ఈనాడు టీఆర్ఎస్‌కు జై..! కాంగ్రెస్ రాజగోపాల్ మనసులోని మర్మమేంటో..!!

మరిది వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని కేసు..!

మరిది వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని కేసు..!

దాంతో మనస్థాపానికి గురైన శ్రీదేవి అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో రామయ్య ఇంటి దగ్గరే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై ఏటూరు నాగారం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. వరంగల్‌కు తరలించే క్రమంలో చనిపోయిందని తెలిపారు. అమాయకురాలైన తమ చెల్లెను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న రామయ్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అర్జున్. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
The worst happened in Warangal district. The incident of marital suicide of a few others was discussed in the district. Relatives of her mother allege that she was suicidal after her husband's death and that it was more than a few months later. The case is being investigated by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X