వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మామునూరు ఎయిర్ పోర్ట్ కు త్వరలోనే మహర్దశ : మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

చారిత్ర‌క మామునూరు ఎయిర్ పోర్టుకు త్వ‌ర‌లో మ‌హ‌ర్ధ‌శ‌ పట్టనుందని , పునః ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి లతో కలిసి మామునూరు ఎయిర్ పోర్ట్ ను సందర్శించారు. మంత్రి ఎయిర్ పోర్ట్ అధికారులతో మాట్లాడారు. వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్ కు పునర్వైభవం తీసుకు రావడం కోసం, ఎయిర్ పోర్ట్ ని తిరిగి ప్రారంభించడం కోసం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైనట్లుగా ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.

ఈ పైసలేమైనా మీ అయ్య సొమ్మా ? గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్ లో బల్దియా ఇంజనీర్లపై చల్లా ఫైర్ఈ పైసలేమైనా మీ అయ్య సొమ్మా ? గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్ లో బల్దియా ఇంజనీర్లపై చల్లా ఫైర్

మామునూరు ఎయిర్ పోర్టుకు ఎంతో చరిత్ర ఉందని, ఎయిర్ పోర్ట్ స్థలాన్ని పరిశీలించిన ఆయన పేర్కొన్నారు. ఎయిర్ పోర్ట్ అధికారులతో కలిసి స్థల పరిశీలన గావించారు. 1930లో దేశానికి స్వాతంత్య్రం రాకముందే వరంగల్లోని మామునూరు అతిపెద్ద విమానాశ్రయంగా ఉండేదని, అప్పట్లో వర్తక వాణిజ్యాలకు ఈ ఎయిర్ పోర్ట్ ప్రధాన కేంద్రంగా ఉండేదని పేర్కొన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు, వరంగల్ లో ఉన్న ఆజంజాహి మిల్లు వర్తక వాణిజ్య వ్యాపారాల కోసం హైదరాబాదు నిజాం చివరి రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీనిని నిర్మించారని పేర్కొన్నారు. మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణ సమయంలోనే మహారాష్ట్ర షోలాపూర్ లో కూడా విమానాశ్రయం కట్టారని ఆయన గుర్తు చేశారు.

Minister Errabelli dayakar rao said Mamunur Airport will reopen soon

ఈ విమానాశ్రయం ద్వారా 1980 దశాబ్దం వరకు రాకపోకలు సాగించారని, దేశ ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు తరచుగా ప్రయాణించే వారిని ఆయన పేర్కొన్నారు. భారత వైమానిక దళాలకు కూడా మామునూరు ఎయిర్ కోర్టు సేవలందించినదని మంత్రి ఎర్రబెల్లి గుర్తుచేశారు.
ఇండో చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ విమానాశ్రయం లక్ష్యంగా చైనా దాడులు చేసిన సమయంలో ఈ విమానాశ్రయం కేంద్రంగా వైమానిక దళ సేవలను అందించారని అంతటి చరిత్ర ఉన్న విమానాశ్రయం మామునూరు విమానాశ్రయం అని పేర్కొన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురై వినియోగం లేకుండా పోయిన ఈ విమానాశ్రయాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది అని ఆయన పేర్కొన్నారు
వరంగల్ లో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు తాము కృషి చేస్తామని పేర్కొన్నారు.

1140 ఎకరాల స్థలం మామునూరు ఎయిర్ పోర్టు కోసం అవసరం ఉందని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు అని, ప్రస్తుతం 700 ఎకరాల స్థలం ఉండగా, మరో రెండు వందల ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయంలో కేటీఆర్ ఇప్పటికే చర్చలు జరిపారని ఎయిర్ పోర్టు అథారిటీ సూచనల ప్రకారం భూ సేకరణ జరుపుతామని తెలిపారు. వరంగల్ వాసుల దశాబ్దాల కల మామునూరు ఎయిర్ పోర్టు తప్పక నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

English summary
State Panchayat Raj and Rural Development Minister Errabelli Dayakar Rao has made it clear that the historic Mamunur Airport will be reopened soon and the Telangana government is gearing up for the reopening. Minister Errabelli Government Chief Whip Vinay Bhaskar along with MLAs Aururi Ramesh and Challa Dharmareddy visited Mamunur Airport. The minister spoke to airport officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X