• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మేడం బాగానే ఊపుతున్నారు.. ఇక్కడ మాత్రం ఊపడంలేదు.. మంత్రి ఎర్రబెల్లి నోటి దూల

|

ప్రజా ప్రతినిధులు అధికారులను లెక్క చేయడం లేదు. కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు. కొందరు పర్లేదు.. కానీ మరికొందరు తమ నోటి దూల ప్రదర్శిస్తున్నారు. సభలో.. అందరీ ముందు కామెంట్స్ చేసిన సందర్భాలు కొకొల్లలు.. తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా నోరుపారేసుకున్నారు. ఓ మహిళ ఎంపీడీవోతో అనుచితంగా కామెంట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు పక్కనే ఉన్న వారంతా నవ్వడంతో.. అధికారి అవమానానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 ఆక్సిజన్ కొరత అధిగమిస్తున్నాం.. కాన్సంట్రేటర్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి ఆక్సిజన్ కొరత అధిగమిస్తున్నాం.. కాన్సంట్రేటర్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

మహిళ అధికారితో నీచంగా..

మహిళ అధికారితో నీచంగా..


ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలను పరిశీలించారు. పెద్ద పాపయ్య పల్లెలో నిరసన సెగ కడా ఎదురయ్యింది. అయితే వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో కూడా పర్యటించారు. పల్లె ప్రగతి సభ నిర్వహించారు. ఈ సమయంలో పనులను ఆరా తీశారు. వైకుంఠ ధామం.. ఇతర పనుల వివరాలను అడిగారు. అక్కడే ఉన్న ఎంపీడీవోను పిలిచారు. గ్రూపు-1 క్యాడర్‌కు చెందిన ఆ అధికారి మహిళ.. కానీ ఆమెతో నీచంగా మాట్లాడారు.

మేడం అని ఊపడం ఏంటీ..

మేడం మీరు బాగానే ఊపుతున్నారు.. ఇక్కడ ఊపుతలేరు అని కామెంట్ చేశారు. తెలంగాణ ఊపడం అంటే డబుల్ మీనింగ్.. అదీ కూడా మహిళా అధికారితో బీహెవ్ చేయడం కరెక్టు కాదు.. తెలంగాణ యాసలో చక్కగా పనిచేస్తున్నట్టు అనుకొవచ్చు.. కానీ మహిళతో మాట్లాడటం సరికాదు. మంత్రి మాటలకు అక్కడే ఉన్న గొర్ల లాంటి నేతలు పళ్లున నవ్వారు. దీంతో ఆమె మరింత ఇబ్బందికి గురయ్యారు. వెనక నుంచి ముందుకు కూడా రానీ పరిస్థితి.. ఇదీ బంగారు తెలంగాణలో నేతల పరిస్థితి. కొందరు చేసే కామెంట్లు.. పార్టీకి, ప్రభుత్వానికి మచ్చ తీసుకువస్తున్నాయి.

ఏకీపారేస్తున్న నెటిజన్లు

ఏకీపారేస్తున్న నెటిజన్లు


మహిళ అధికారితో మంత్రి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా మంత్రిని ఏకి పారేస్తోంది. ఏం మంత్రి మీరు కనీసం రెస్పక్ట్ కూడా ఇవ్వరా అంటూ దుమ్ము దులిపేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. బంగారు తెలంగాణలో అధికారులతో ప్రవర్తించే తీరు ఇదేనా అని ఫైర్ అవుతున్నారు.

English summary
telangana minister errabelli dayakar double meaning dialogues to mpdo madam at uppal palle pragati programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X