• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డీసీపీ రక్షితపై సీతక్క నిప్పులు.. వెహికిల్ అడ్డుకోవడంతో ఫైర్.. ఎమ్మెల్యేకే ఇలా.. (వీడియో)

|

లాక్‌డౌన్ పేరుతో ఖాకీలు రెచ్చిపోతున్నారు. సమయం అయ్యిందంటే చాలు ఊరుకోవడం లేదు. చివరికీ ఈ-పాస్ చూపించిన లెక్కచేయడం లేదు. కరోనా కాలంలో ఆస్పత్రికి.. మందులు, ఇతరత్రా అవసరాల కోసం వెళ్లే వారి పరిస్థితి ఏంటీ... లాక్ డౌన్ సమయంలో మార్పు చేశారు.. కానీ జనం ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదు. జనానికే కాదు ఎమ్మెల్యేలకు కూడా ఇలాంటి నిబంధనలే అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బంధువులు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. తమ పరిస్థితిని సీతక్క పూసగుచ్చినట్టు వివరించారు.

మిస్ బిహేవ్ సరికాదు..

మిస్ బిహేవ్ సరికాదు..


సీతక్క తల్లి ఆరోగ్యం బాగోలేదు. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమెకు రక్తం అవసరం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో సీతక్క బంధువులు.. ఈ-పాస్ తీసుకొని మరీ వాహనంలో బయల్దేరారు. కానీ వారిని పోలీసులు నిలిపి వేశారు. మేడ్చల్ మల్కాజిగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. విషయం ఏంటో వివరించినా పట్టించుకోలేదట. తమ బంధువుల పట్ల డీసీపీ రక్షిత ఇబ్బందికరంగా ప్రవర్తించారని తెలిపారు. మిస్ బీహెవ్ చేశారని.. ఇదీ సరికాదు అని సీతక్క ఫైరయ్యారు.

రక్తం అవసరం ఉండటంతో..

రక్తం అవసరం ఉండటంతో..


తన తల్లికి రక్తం అవసరం ఉందని సీతక్క తెలిపారు. బ్లడ్ తీసుకొస్తున్నామని చెప్పినా.. డీసీపీ వినిపించుకోలేదు. అరగంటకు పైగా పక్కన నిలబెట్టి తన అధికార దర్పాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. డీసీపీకి తాను ఫోన్ చేశానని.. అయినా మాట్లాడలేదని పేర్కొన్నారు. డొంట్ టాక్ రబ్బిష్ అంటూ రక్షిత తమ వారిపై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. తమ ఇబ్బంది చెప్పి.. పాస్ చూపించినా ఇదేం పద్ధతి అని అడిగారు. మంచి పద్ధతి కాదని.. తీరు మార్చుకోవాలని సూచించారు. అధికారంలో ఎప్పుడూ ఒకరే ఉండరని.. ఇవాళ వారు.. రేపు మేమే అనే విషయం గుర్తుంచుకోవాలని కోరారు.

ఎమ్మెల్యేకే ఇలా..

ఎమ్మెల్యేకే ఇలా..

ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటీ అని అడిగారు. రక్షిత డ్యూటీ ముగిశాక కానీ.. తమ బంధువులు వెళ్లలేరని చెప్పారు. ఆమె స్థానంలో వచ్చిన మరొకరు వెళ్లేందుకు సాయం చేశారని పేర్కొన్నారు. వారి లాగా రక్షిత ఎందుకు ప్రవర్తించలేదు అని అడిగారు. ఇద్దరు సేమ్ క్యాడర్ కదా..? రక్షిత ఎందుకు మొండిగా ప్రవర్తించారని ప్రశ్నించారు.

ఎడ్లబండిపై పయనించి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం అడవి రంగాపూర్‌ గ్రామంలో బండ్లపహాడ్‌ గొత్తికోయగూడెం వాసులకు సీతక్క ఆప‌న్న‌హస్తం అందించారు. గ్రామానికి దూరంగా నివసిస్తున్న గొత్తికోయలు కోవిడ్ నేప‌థ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. గుత్తికోయల వద్దకు వెళ్లి సరుకులు అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతానికి స‌రైన మార్గం లేదు. న‌డుస్తూ అంత‌దూరం స‌రుకులు తీసుకెళ్ల‌డం క‌ష్టం. ఈ క్ర‌మంలో ఎడ్లబండిపైనే ఆమె ప్రయాణించారు. ఆ బండిపైనే సరుకులు వేసుకుని అదే బండిపై తానూ అక్క‌డికి చేరుకున్నారు. ఆమె వెంట అనుచరులు, గన్‌మ్యాన్లు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. బియ్యం, కూరగాయలు, ఇతరత్రా సరుకులు గొత్తికోయలకు అందజేసి సీతక్క వారికి అండగా నిలిచారు. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో సీత‌క్క చేసిన స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌లు అభినందిస్తూనే ఉన్నారు.

English summary
congress mla sitakka angry on dcp rakshitha for stop her relations. who goes to hyderabad for blood donation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X