వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యంత్రాంగాన్ని కదిలించిన వృద్ధుల "లంచం కోసం బిచ్చం".. ఎమ్మార్వో సస్పెన్షన్

|
Google Oneindia TeluguNews

భూపాలపల్లి : లంచం ఇవ్వడానికి వృద్ధ దంపతులు భిక్షమెత్తుకుంటున్నారనే వార్త ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఆ ఘటన వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. లంచం అడిగిన ఇద్దరిపై వేటు వేశారు జిల్లా కలెక్టర్.

ఆజం నగర్ కు చెందిన మాంత బసవయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు, తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ ల కోసం రెండేళ్లుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆ క్రమంలో లంచం ఇస్తే తప్ప పని కాదని వీఆర్‌వో తో పాటు తహసీల్దార్ కూడా చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో భిక్షాటనకు దిగారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వృద్ధ దంపతులు భిక్షాటన చేస్తున్న దృశ్యం మీడియా కంటపడటంతో విషయం వెలుగుచూసింది. ఈ వార్తను వన్ ఇండియా తెలుగు వెబ్ సైట్‌తో పాటు మీడియా మొత్తం పబ్లిష్ చేసింది. ఆ విషయం తెలంగాణ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.

mro and vro suspended for bribe in warangal district

లంచం కోసం వృద్ధ దంపతులు భిక్షాటన చేస్తున్నారనే వార్తతో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పందించారు. సమస్య పరిష్కారించాలంటూ భూపాలపల్లి ఆర్డీవోను ఆదేశించారు. దీంతో తన కార్యాలయానికి పిలిపించి 4 ఎకరాల 10 గుంటలకు సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ ఆ వృద్ధ దంపతులకు అందించారు ఆర్డీవో వెంకటాచారి. మిగతా 5 ఎకరాల 7 గుంటలకు సంబంధించిన భూమి వివాదంలో ఉందని, పూర్తిగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ అందిస్తామని తెలిపారు. అదలావుంటే లంచం పేరుతో వృద్ధ దంపతులను పీడించిన వీఆర్‌వో శ్రవణ్, తహసీల్దార్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు కలెక్టర్.

English summary
mro and vro suspended in the bribe case who demanded cash from old age couple in warangal district. Collector given orders to RDO to rectify the old age couple land issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X